- Advertisement -
- – పోస్టర్ ఆవిష్కరణ
– సీపీఐ మండల కార్యదర్శి బైస స్వామి - నవతెలంగాణ – నెల్లికుదురు
- మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలంలో గాజుల రామవరం షాపూర్ నగర్ మహారాజ గార్డెన్ లో ఈనెల 20 నుండి 22 వ తేదీ వరకు జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి బైస స్వామి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో సంబంధిత వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండా పార్టీ అని పేదల హక్కుల కోసం ఒక నిర్మాణాన్ని చేసి ప్రతి పేదవాడికి కూడు గూడు దున్నేవాడికే భూమి సమాన పనికి సమాన వేతనం హక్కులను కల్పించేదే కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తుటి వెంకటరెడ్డి, నాయకులు చిర్ర వెంకన్న, తుటి సుధాకర్ ,తుటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -