No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఎడిట్ పేజిఈ దువ్వడం వెనకాల?

ఈ దువ్వడం వెనకాల?

- Advertisement -

పంద్రాగస్టున ప్రధాన మంత్రి చేసే ప్రసంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే దేశంలో నెలకొన్న కీలక పరిణామాలకు మోడీ నోట అనేక సమాధానాలు వస్తాయనేది ప్రజల్లో అంచనా. కానీ, వారి అంచనాలను తలకిందు లు చేస్తూ , దేశం మనసులోని సందే హాలకు ఆస్కారమివ్వకుండా ఇతర చర్చకు హైప్‌ ఇచ్చేలా మోడీ ప్రసంగం సాగింది. ఇంతవరకు ఏ ప్రధాని మాట్లాడని రీతిలో సుధీర్ఘ సమయం ఉపన్యాసమిచ్చి రికార్డ్‌ను సొంతం చేసుకున్నారని గోడిమీడియా ఆయన్ను ఆకాశానికెత్తుకుంది. కానీ, మోడీ తాను రాజకీయ ఓన మాలు దిద్దుకున్న ఆరెస్సెస్‌పైఔ పొగడ్తల వర్షం కురిపించడం పట్ల దేశం ఒకింతా అసంతృప్తికి లోనైంది. తనను గద్దె దించే పనిలో పడిన ఆరెస్సెస్‌ను ప్రసన్నం చేసుకోవడంలో ప్రధాని ప్రస్తుతానికి సఫలమైనా విపక్షాలను డైలామాలో పడేసే డైవర్ట్‌ పాలిట్రిక్స్‌ విషయంలో మాత్రం ఆయన గన్‌ మిస్‌ఫైర్‌ అయిందని స్పష్టమైంది. ఆరెస్సెస్‌ను గొప్ప స్వచ్ఛంద సంస్థగా ప్రశంసించడం ద్వారా దేశంలోని అన్ని పక్షాలు ఈ ప్రశంసపైనే చర్చ సాగేలా చేయాలన్నది మ్రోడీ వ్యూహంగా కనిపించింది. దీనికి కారణం లేకపోలేదు. ఆపరేషన్‌ సిందూర్‌ మొదలు పాకిస్తాన్‌పై భారతదేశం సీజ్‌ ఫైర్‌కు ఒప్పుకోవడానికి తానే కారణమని ట్రంప్‌ పదే పదే ప్రకటనలు చేస్తున్న సందర్భంలో మోడీ సర్కార్‌ రియాక్షన్‌ను విపక్ష ఇండియా కూటమి పదేపదే లెవనెత్తుతూ మోడీకి చుక్కలు చూపించింది. తాజాగా దొంగ ఓట్ల అంశంపై ‘ఓట్‌ చోర్‌ గద్ది చోడ్‌’ నినాదంతో రాహుల్‌ నాయకత్వంలో ఇండియా కూటమి దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వీటన్నింటికి పంద్రాగస్టు వేడకల్లో ప్రధాని స్పందించి సమాధానమిస్తారని యావత్తు దేశ ప్రజలు ఎదురుచూశారు. కానీ, ఈ అంశం నుంచి ప్రజలతోపాటు విపక్షాలను పక్కదారి పట్టించారు.

‘మోడీ గొప్ప ధీశాలి, ఆయన ఛాతి 56 ఇంచులు, ఆయన గుండె ధైర్యం ప్రత్యర్ధులకు దడ పుట్టిస్తుంది.’ ఇవన్నీ మోడీని తరచూ కీర్తించే వారి నోటి నుంచి వచ్చే పడి కట్టు పదాలు. కానీ మోడీ ట్రంప్‌కు ఎందుకు భయడపుతున్నారన్నది ప్రజలనుంచి వస్తున్న ప్రశ్నలు. ఇటీవల కాలంలో ఇండియా కూటమి నుంచి ప్రశ్నలు వస్తున్నవేళ ఆయన ఆరెస్సెస్‌పై వ్యూహాత్మకం గానే ప్రశంసలు కరిపించినట్టు అర్థమవుతోంది. బీజేపీ అధికారంలోకి రావడానికి, పార్టీకి మొత్తం దిశా నిర్దేశం చేసేదే ఆరెస్సెస్‌ అని ఘంటాపథంగా చెబుతారు. కానీ, బీజేపీ పెద్దలుగా, కాషాయ ద్వయంగా పేరు గడించిన మోడీ, అమిత్‌ షా ఈ ఇద్దరూ కూడా ఆ మధ్యకాలంలో ఆరెస్సెస్‌ అంటే ఎందుకో ఆగ్రహంగా ఉన్నారని కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. 2024 ఎన్నికల్లో కూడా వీరు ఆరెస్సెస్‌ని పక్కన పెట్టారన్న బహిరంగ విమర్శ ఉంది. ఇక బీజేపీకి ఎంతో సమర్ధత ఉందని, ఆరెస్సెస్‌ తమకు అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత లోక్‌సభ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడీకి, ఆరెస్సెస్‌కు మధ్య దూరం మరింత పెరిగింది. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడం, రోజురోజుకూ ఇండియా కూటమి ప్రభావం దేశంలో పెరుగుతుండటంతో తానోక్కడినే విపక్షాలను ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న మోడీ వ్యూహాత్మకంగా ఆరెస్సెస్‌ను పొగిడారని తెలుస్తోంది. ఇలా ఆరెస్సెస్‌కు దగ్గరవడం రాబోవు రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంస్థ సహాయంతో గెలవాలని ఎత్తుగడ అని ప్రచారం జోరందుకుంది. రాజకీయాల్లో 75 ఏండ్ల వయసు పరిమితని వస్తున్న ప్రమాదం నుంచి గట్టెక్కడం కోసం మోడీ ఓ మెట్టు దిగుతూ వస్తున్నారన్న వాదనలు కూడా కొట్టి పారేయలే స్థితి!

మోడీ పదకొండేండ్ల ప్రధానమంత్రిత్వంలో ఎపుడూ సంఘ్‌కార్యాలయానికి వెళ్లింది లేదు. కానీ ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల కాలంలో నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించి వచ్చారు. ఈ ఘటనలన్నీ చూస్తే మోడీలో ఎన్నడూ కనిపించని భయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు విపక్షాలు కూడా అనేక అంశాల్లో గట్టి కౌంటర్‌ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్‌ను ప్రసన్నం చేసుకోవడం మోడీకి అత్యవసరంగా కనిపిస్తోంది. ఈ ఎడబాటు మరింత పెరగకుండా చూసుకునేందుకే, ఆరెస్సెస్‌ను కీర్తిస్తూ పంద్రాగస్టు ఉపన్యాసాన్ని కాషాయమయం చేశారని విశ్లేషకులు బహిరంగం గానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎస్‌డి.నిసార్‌ అహ్మద్‌
7801019343

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad