- Advertisement -
శివాజీ ప్యానల్ అఖండ మెజారిటీతో గెలుపు
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నూతన కార్యవర్గా ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలలో శివాజీ ప్యానల్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజేతలుగా అధ్యక్షులుగా డి శివాజీ,కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా సైబ శారీక,జాయింట్ సెక్రెటరిగా డి.రామరాజు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారులుగా పేరేవార్ శ్రీధర్,రెయిన్బో రాజేందర్, విధులు నిర్వహించారు.ఎన్నికల కమిటీ సభ్యులుగా రాజేంద్రప్రసాద్, కరిపే రాజు ,ఏముల మోహన్,దువ్వ వెంకటేష్ విధులు నిర్వహించారు.
- Advertisement -