- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్రను వాయిదా వేసింది. రేపు (28న) నకిరేకల్ నియోజక వర్గంలో జరగబోయే జనహిత పాదయాత్ర, 29న అచ్చంపేట, 30న జూబ్లీహిల్స్ లో జరగబోయే సభలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు పాదయాత్ర కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇవాళ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. జులై 31 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర నిర్వహిస్తున విషయం తెలిసిందే.
- Advertisement -