- Advertisement -
- – ఆకర్షనీయంగా మండల కేంద్రంలో శెత్కరి గణేష్ మండలి గణనాథుడు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాల్లోని ప్రతి గ్రామంలో గల్లి గల్లి లో గణనాథులు కొలువుదీరారు. మండల కేంద్రంలోని రథం గల్లి శత్కరి గణేష్ మండలి గణనాథుడు అందరిని ఆకర్షించే విధంగా ఎడ్ల బండి పై కూర్చొని ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఈ గణపతి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది దీని మూలంగా ఆకర్షణీయంగా గణనాధుని విగ్రహమే కాకుండా నవరాత్రుల్లో 11 రోజులు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ గణనాథుడు వ్యవసాయదారులకు సంబంధించిన శెత్కరి గణేష్ మండలి ఈ గణేష్ మండలి ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు 11 రోజులు చేపడుతున్నారు. వ్యవసాయదారులంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
- Advertisement -