- Advertisement -
- – చర్యలు ఉండేనా..?…తూతూమంత్రం అయ్యేనా..?
నవతెలంగాణ-మల్హర్ రావు - మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా తాడిచెర్లలో చేపట్టిన ఉపాధిహామీ పథకం పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన16వ విడత సామాజిక ప్రజావేదికలో సోషల్ ఆడిట్ అధికారులు ప్రవేశపెట్టిన నివేదికలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.2024-25 ఆర్థిక సంవత్సరంలో హరితహారంలో నాటిన మొక్కల్లో మోకాపై సగం మొక్కలు లేకపోవడం,పంపిణీ చెసిన మొక్కల్లో సరిగ్గా లెక్కలు లేకపోవడం ఉందని తెలిపింది.ఉపాది పనులకు వెళ్లకున్న ఇంటివద్ద ఉన్నవారికి కూలి డబ్బులు చెల్లింపులు,ఒక్కరికి బదులు ఒక్కరూ పనులకు వెళ్లడం, ఉపాధిహామీ పిల్డ్ అసిస్టెంట్ మెడగాని రాజయ్య కొడుకు,కోడలు పనులకు వెళ్లకున్న ఒక్కొక్కరికి రూ.8,500,రూ.581 కూలి చెల్లింపులు తదితరుల భారీ అవకతవకలు జరిగాయి.ఈ అక్రమాలపై సంబంధించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా..కంటి తుడుపు చర్యగా చేతులు దులుపుకుంటారో వేచి చూడాలసిందే.
- Advertisement -