- Advertisement -
నవతెలంగాణ డిచ్ పల్లి
భారీ వర్షాల కారణంగా ఇందల్ వాయి మండలం లోని గన్నారం ఉపకేంద్రంలోనికి భారీ వరద నీరు వచ్చిన కారణంగా గన్నారం ఉపకేంద్రాన్ని, 220/132/33 కె వి డిచ్ పల్లి ఉపకేంద్రాన్నీ ట్రాన్స్ కో సిఎండి వరుణ్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించి పర్యవేక్షించారు. వినియోగదారులకు కరెంట్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
వారి వెంట నిజామాబాద్ సూపరింటెండింగ్ ఇంజనీర్ అర్ రవీందర్, డిచ్ పల్లి డివిజనల్ ఇంజనీర్ ఎ. రమేష్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ జి. శ్రీనివాస్, ఎఈ బర్దిపూర్ రాజేందర్, ఎఈ డిచ్ పల్లి గంగారాం తోపాటు లైన్ మెన్లు, జూనియర్ లైన్ మెన్లు తదితరులు వారి వెంట ఉన్నారు.
- Advertisement -