
తెలంగాణ యూనివర్సిటీ లోని రెగ్యులర్ బ్యాక్లాగ్ పీజీ, బీఈడీ పరీక్ష కేంద్రాన్ని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం ఉదయం జరిగిన పీజీ 03.వ సెమిస్టర్, 06వ సెమిస్టర్, బీఈడీ రెగ్యులర్ సెమిస్టర్, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు కోనసాగాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా చూడాలని విధులలో ఉన్న ఇన్విజిలేటర్లకు సూచించారు. పరీక్షలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి యూనివర్సిటీ కీ మంచి గుర్తింపు తీసుకురావాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రార్ తో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ హారతి, వైస్ ప్రిన్సిపాల్ మావురపు సత్యనారాయణ, డా”రవీందర్ రెడ్డి తదితర అధ్యాపకులు ఈ తనిఖీలో పాల్గొన్నారు.
– పీజీ రెండవ సెమిస్టర్, బ్యాక్ లాక్ పరీక్షలకు 2001 మంది నమోదు కాగా 1831 హాజరు కాగా 170 మంది గైరాజరైరయ్యరు.
– పీజీ నాలుగవ రెగ్యులర్, సెమిస్టర్ బ్యాక్ లాక్ పరీక్షలకు 23 ఉండగా23 పూర్తిస్థాయి విద్యార్థులు హాజరయ్యారు.
– బిఈడి సెమిస్టర్ పరీక్షలకు195 ఉండగా180 హాజరయ్యారు 15 మంది గైరాజరయ్యారు.
– బీఈడీ రెగ్యులర్ సెమిస్టర్, బ్లాక్ లాక్ మధ్యాహ్నం పరీక్షలకు 1324 ఉండగా 1292 హాజరయ్యారు 32 మంది గైర్హాజరయ్యారు.
– పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ గా తెలిపారు.