
– విలేకరుల సమావేశంలో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత ఎన్నికల సమయంలో ప్రజల కిచ్చిన హామీల కంటే అధికంగానే నెరవేర్చానని, ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసే విమర్శలను అసలు పట్టించుకోనని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సాగునీరు తేవడం లేదని ఆరోపిస్తున్నారని, రైతులకు సాగు నీరు కు ప్రస్తుతం కొదవలేదన్నారు. రూ.2000 కోట్లు వ్యయంతో మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నా యన్నారు. కుడి, ఎడమ రెండు వైపులా పైపైన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రతిపక్ష పార్టీల నాయకుల అబద్దపు మాటలను నమ్మి కొందరు రైతులు తమ పంట భూముల్లో నుండి పైప్ లైన్ వేయనీయక పోవడంతో నీళ్లు వ్వలేకపోయామని, నీళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కావాలనే రైతులను రేచ్చగోడ్తున్నరని దింతో కాస్త ఆలస్యం అవుతుందన్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ పాత డిజైన్ ప్రకారం పనులు జరిగే అవకాశం లేదని ఈ విషయం గమనించి రైతులు పైప్ లైన్ ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.త్వరలో రూరల్ నియోజకవర్గంలో 300 మంది లబ్దిదారులకు బీసీ బంధు కింద ఒక్కొక్కరికి లక్ష చొప్పున అందజేస్తామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ముస్లిం మైనార్టీ బంధుకు 100 మంది లబ్దిదారులకు లక్ష చొప్పున అందజేస్తామన్నారు. నియోజకవరంలోని 1100 మంది లబ్దిదారులకు దళిత బంధు అందజేస్తామన్నారు.ఎస్సీ జనాభా కనుగుణంగా ఆయా మండలాల్లో లబ్దిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. అలాగే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి నియోజకవర్గంలో 3వేల మంది లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున మండలానికి 400 మంది కి గృహ లక్ష్మి అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ను అడిగి మరో 2 వేలు అదనంగా గృహలక్ష్మి కి అనుమతి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిచ్ పల్లి మండలంలో కాస్త అధికంగా లబ్దిదారులకు గృహలక్ష్మి అందజేయడానికి కృషి చేస్తామన్నారు.
రూరల్ లో బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.19.16కోట్లు మంజూరు..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల లింక్ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రజల వినతి మేరకు బీటీ రోడ్ల నిర్మాణం కోసం = రూ.19కోట్ల 16లక్షల 50వేలు నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో డిచ్ పల్లి మండలంలోని కమలాపూర్ నుంచి ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి వయా ట్రైబల్ మోడల్ స్కూల్ రోడ్డు కు రూ.2.30కోట్లు, ఆరేపల్లి నుంచి ముల్లంగి (ఐ) వరకు బ్రిడ్జి కమ్ రోడ్ కు రూ.1.70 కోట్లు, సుద్దులం ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి కొరట్ పల్లి బైపాస్ వరకు రూ.1.80 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు ఎన్నికల కంటే ముందుగానే ప్రారంభిస్తామన్నారు.డిచ్ పల్లి మున్సిపాల్టీ ఏర్పాటు ఎప్పుడౌతుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు నవతెలంగాణ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎన్నికల తర్వాత డిచ్ పల్లి మున్సిపాలిటీ గా మారుస్తామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు నారాయణరెడ్డి, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్,సినియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, మోహన్ రెడ్డి, ఎంపిటిసి లు ఫోరం అధ్యక్షులు సాయిలు, యూత్ అధ్యక్షులు అమీర్ ఖాన్,నీరడి పద్మారావు,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్, విఠల్ రావు, అంబర్సింగ్, లింగం యాదవ్,మోహమ్మద్ యూసూప్, జగదీశ్, ఇర్ఫాన్, సాకలి సాయిలు, కార్యకర్తలు తదితరులున్నారు.