డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులకు పంపిణి చెయ్యాలి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులకు పంపిణి చెయ్యాలని, స్థలం లేని వారికి స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గురువారం ఇందల్ వాయి తహసిల్దార్ వెంకట్రావు కు అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు నాయుడు రాజన్న మాట్లాడుతూ తెలంగాణాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని హామీలిచ్చి తొమ్మిదిన్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కల గానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తొందరగా అందించాలని భారతీయ జనతా పార్టీ ఇందల్ వాయి మండల శాఖ తరపున బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాజన్న పేర్కొన్నారు.స్థలం ఉన్న వారందరికీ ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని పేదలు, నిరుపేదలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.57 ఏళ్ళు దాటిన వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో మహేష్, నాగేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love