పి ఆర్ రోడ్లకు రూ .67 కోట్లు 

– పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
– అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ నియోజకవర్గనికి రూ.67 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, నియోజకవర్గ వ్యాప్తంగా పిఆర్ రోడ్ల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పాడైపోయిన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు.కావలసిన నిధులను ప్రభుత్వం ద్వారా తక్షణమే మంజూరు చేస్తానని తెలిపారు. ఇండోర్ స్టేడియంను మున్సిపాలిటీకి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే అక్టోబర్ నెల 5న ఇంటిగ్రేటెడ్(ఐఓసీ) బిల్డింగ్ ను ప్రారంభిస్తామన్నారు . అక్కన్నపేట మండలం మల్లారంలో నూతనంగా మంజురైనా సబ్ స్టేషన్ పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
Spread the love