- Advertisement -
నవతెలంగాణ-కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 18న జరిగినటువంటి జిల్లా స్థాయి కబడ్డీ సబ్ జూనియర్ సెలెక్షన్స్ లో కేజీబీవీ కాటారం విద్యార్థినీ యం. నాగేశ్వరి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ క్రీడాకారిణి సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నిజామాబాద్ లో జరగ బోయే రాష్ట్ర స్థాయిలో ఆడనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ చల్ల సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థిని నాగేశ్వరినీ, పీఈటి రాజేశ్వరి, ప్రిన్సిపాల్ చల్ల సునీత ఈ సందర్బంగా అభినందించారు.
- Advertisement -