- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ వేడుకలు అని డాక్టర్ హైమావతి అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం శారజీపేట ఆధ్వర్యంలో పీహెచ్సీ,పల్లె దవఖాన అరోగ్య సిబ్బంది,ఆశ కార్యకర్తలు ఆట పాటలతో ఆడి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ…బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతకమ్మ ఉయ్యాలో అంటూ హుషారుగా పాటలు పాడుతూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పల్లె దవాఖన డాక్టర్లు సిహెచ్ఓ పీహెచ్ఓ సూపర్వైజర్లు ఏఎన్ఎం లు ఆశా కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -