- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్‌గా జీ చంద్రశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారంనాడిక్కడి రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌శర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) రిటైర్డ్ అధికారి అయిన చంద్రశేఖరరెడ్డితో పాటు మరో ఏడుగురు కమిషనర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
- Advertisement -