- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన గజ్జెల విజయలక్ష్మికి రూ.రూ.2లక్షల ఎల్ఓసి మంజూరు పత్రాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, ఏమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం సాయంత్రం అందజేశారు. హృద్రోగా సమస్యతో బాధపడుతున్న గజ్జెల విజయలక్ష్మి చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. ఈ విషయాన్ని స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకోచ్చారు.పేదవారైనా వారికి చికిత్స కొరకు రూ.2లక్షల ఎల్ఓసి మంజూరు చేయించి, అట్టి మంజూరు బాధితురాలి కుమారుడు శ్రీనివాస్ కు హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్బంగా బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు.
- Advertisement -