- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలోని సచివాలయం ప్రాంతంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చారు. దీనికి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేరకు ఆ ఫ్లైఓవర్‌పై కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. కాగా, కోఠి ఉమెన్స్ మహిళా యూనివర్సిటీతో పాటు పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం పేర్లు కూడా ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. కోఠి ఉమెన్స్ కు వీరనారి ఐలమ్మ పేరు పెట్టగా, పొట్టిశ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాయలంగా నామకరణం చేశారు. తాజాగా తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు తెలంగాణ తల్లి ఫైఓవర్‌గా పేరు మార్చారు.
- Advertisement -