- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక జడ్పీటీసీ బరిలో మాజీ సర్పంచ్ ముక్కపల్లి శ్రీనివాస్ ఉంటున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక జెడ్పీటీసీ ఎస్సీ జనరల్ రిజర్వ్ కావడంతో పోటీ చేసేందుకు మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన ముక్కపల్లి శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
జానపద కళాకారుడిగా, సింగర్ గా ఈ ప్రాంత ప్రజలకు ముక్కపల్లి సుపరిచితమైన ఆయన 2004 నుంచి టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో చురుకైన పాత్ర పోషించారు. 2013 లో పద్మనాభునిపల్లి సర్పంచ్ గా పనిచేశారు. త్వరలో జరగబోవు పంచాయతీ ఎన్నికలలో జడ్పీటీసీ గా పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
- Advertisement -