- Advertisement -
కొయ్యుర్ పోలీసుల హెచ్చరిక
నవతెలంగాణ – మల్హర్ రావు
మానేరు పరివాహక ప్రాంతమైన మండలంలోని తాడిచెర్ల, వళ్లెంకుంట, ఇప్పలపల్లి ,కేశారం పల్లి ,కుంభంపల్లి, పివి నగర్, కొండంపేట, మల్లారం, రావుపల్లి గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు, మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్, ఎస్ఐ-2 రాజన్ కుమార్ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ గెట్లు ఎత్తడం జరిగిందని, మానేరు వాగులోకి చాపల వేటకు గాని, గొర్ల కాపారులుగాని, ఎవరు మానేరు సమీపంలోకి వెళ్ళారాదని సూచించారు.
- Advertisement -