- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన నాగుల రాజయ్య అనే రైతుకి చెందిన గేదె విద్యుత్ షాక్ తగిలి ఆదివారం సాయంత్రం సుమారు 7:30 గంటలకు మృతి చెందింది. మేత కోసం చుట్టు పక్క పరిసర ప్రాంతానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు తెలిపాడు. నిరుపేదనైన తనకు గేదె ఇచ్చే పాలతో జీవనోపాధి పొందుతున్నారని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
- Advertisement -