- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భార్య వదిలేసి వెళ్లిపోవడంతో అందరూ చూసి నవ్వుతున్నారని తీవ్ర అవమానంతో రగిలిపోతున్న ఓ వ్యక్తి చేతిలో బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. గువ్వ కాలనీకి చెందిన ఓ వ్యక్తి భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అదే ప్రాంతానికి చెందిన శ్రీహరి (17) అనే బాలుడు తనను హేళనగా చూస్తూ నవ్వాడని ఆ వ్యక్తి భావించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పదునైన కత్తితో బాలుడి మెడపై నరికాడు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
- Advertisement -