నవతెలంగాణ – మల్యాల
యువతిని బెదిరించి లైంగికదాడి చేసిన నలుగురు దుండగులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించి మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలం నూకపల్లి గ్రామ సమీపంలోని డబుల్ బెడ్‌రూం ఇండ్ల వద్దకు ఓ యువతి, యువకుడు వచ్చారు. ఇదే అదనుగా భావించిన నలుగురు వ్యక్తులు ఆ యువతి వీడియోలు తీసి నెట్‌లో పెడుతామని బ్లాక్‌మెయిల్ చేశారు. ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఈ నెల 3న జరగ్గా.. బాధితురాలు గురువారం మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులు శివరాత్రి నరేష్, గుర్రం శ్రీకాంత్, మారవేని మల్లేశం, గుర్రం అంజయ్యను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై గతంలోనూ పలు కేసులున్నాయి.
లైంగికదాడి కేసులో నలుగురికి రిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



