- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన ధరూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ, ఆలయం కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి తండ్రి కీర్తిశేషులు కొత్తమలే లక్ష్మీ రెడ్డి ప్రథమ వర్ధంతి శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తమలే లక్ష్మీ రెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భీయ్ రెడ్డి, కర్రెప్ప, బషీర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -