– దేశానికి, రాష్ట్రానికి సిద్దిపేటే రోల్ మోడల్
– మంత్రులు హరీశ్‌రావు, సబిత
నవతెలంగాణ-చిన్నకోడూరు
వైద్య, వ్యవసాయ, పశువైద్య, ఫార్మసీ, నర్సింగ్ కళాశా లలతో పాటు అన్నిరకాల విద్యను అభ్యసించడానికి సిద్దిపే టలో కళాశాలలు ఉన్నాయని.. ‘విద్యాలయాలకు ఆలయంగా సిద్దిపేట’ మారిందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలలోని రామంచ శివారులో నూతనంగా నిర్మించిన రంగనా యక స్వామి బీ ఫార్మసీ కళాశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. 8 నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసు కొని కళాశాల నిర్మాణం పూర్తి చేసి.. విద్యా సంవత్సరాన్ని ప్రారం భించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. హైదరా బాద్‌తో పాటు మారుమూలన ఉన్న పల్లెటూర్లు కూడా సమానంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో.. రాష్ట్రాన్ని అభివృద్ధి పంతాలో నడప డంలో బీఆర్‌ఎస్ నాయకులు పోటీ పడుతుంట.. ప్రతిపక్ష నాయకులు తిట్టడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశా రు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉండటం తనకు ఆనం దంగా ఉందన్నారు. కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి కల్పించాలని సొసైటీ కార్యవర్గాన్ని కోరారు.
పలు సాముహిక భవన నిర్మాణాలకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరు.. పత్రాలు అందజేత
నవతెలంగాణ-సిద్దిపేట
నాడు ఉద్యమంలో సిద్దిపేట ప్రజలే ముందున్నారని, నేడు అభివృద్ధిలో కూడా సిద్దిపేటే రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో సోమవారం పట్టణంలోని పలు సామూహిక భవనాల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. పట్టణంలోని ఒకలో వార్డులో విశ్వకర్మ భవన ానికి రూ.5 లక్షలు, శాలివాహన భవనానికి రూ.5 లక్షలు, 2వ వార్డ్‌లో ముదిరాజ్ భవనానికి రూ.10 లక్షలు, రెడ్డి సం ఘానికి రూ.15 లక్షలు, 4 వార్డ్‌లో ఒడ్డెర సంఘానికి రూ.10 లక్షలు, 10వ వార్డ్‌లో గౌడ సంఘానికి రూ.10 లక్ష లు, 12వ వార్డ్‌లో నాయీ బ్రాహ్మణ సంఘానికి రూ.20 లక్ష లు, నీలకంఠ యూత్‌కు రూ.5 లక్షలు, 15వ వార్డు బిరప్ప భవన్‌కు రూ.6 లక్షలు, జంగం భవన్‌కు రూ.15 లక్షలు, 30 వ వార్డులో కిచెన్‌షెడ్ నిర్మాణానికి రూ.25 లక్షల మంజూరు పత్రాలను ప్రతినిధులకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్ర మంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్..
ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రూ.5 లక్షల విలవగల ప్రమాద ఇన్సూరెన్స్‌ను త్వరలోనే అందించనున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రయివేటు పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల ప్రముఖ పాత్ర కీలకం అని, ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయుల ప్రభావం జీవితాంతం ఉంటుందన్నారు. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తుండడంతో ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలకు, బోధన చేసే సిబ్బందికి కొంత ఇబ్బంది కలుగుతుందన్నారు. అయినప్పటికీ సమాజంలో 50 శాతం మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చదువు తున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో 50 శాతం వారి భాగస్వామ్యం ఉందన్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, ట్రస్మా మా ప్రతినిధులు రాఘవేందర్ రెడ్డి, సోమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, రాజేందర్, మోహన్ కుమార్, ప్రసాద్, రవి, చిన్న, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎస్‌ఇ, డీఈ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ తదితరులు పాల్గొన్నారు.
నంగునూరు మండలంలో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన..
నవతెలంగాణ-సిద్దిపేట
నియోజకవర్గంలో నంగునూరు మండలం అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నదని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం నంగునూరు మండలంలో పలు అభివద్ధి పనులు, శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రాంపూర్ గ్రామంలో సీసీరోడ్డు, రాంపూర్ నుండి సిద్దన్నపేట వరకు రోడ్డు పను లు, మహిళా సమైక్య భవనానికి ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు. వడ్డెర కమ్యూనిటీ హాల్, ఓహెచఎస్‌ఆర్ పనులు ప్రారంభించారు. జేపీ తండాలో గ్రామ పంచాయతీ భవనం, కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఆనగోని లక్ష్మీ, బిక్షపతినాయక్, సీత బాలయ్య, ఎంపీటీసీలు ఎనగ ందుల నితిన్, ఎడ్లసౌజన్య-నర్సింహారెడ్డి,ఉప సర్పంచులు, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ తడిసిన ఉమా, రాష్ట్ర ఆయిల్ ఫామ్ సోసైటి ఉపాధ్యక్షుడు ఎడ్ల సోవి ురెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాగుల సారయ్య,వేముల వెంకట్‌రెడ్డి, సోసైటి చైర్మెన్లు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట రోల్ మోడల్ : మంత్రి సబిత
దేశానికి తెలంగాణ, రాష్ట్రానికి సిద్దిపేట రోల్ మోడల్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్వల్ప కాలంలో కళాశాల నిర్మించి విద్యా సంవత్సరం ప్రారంభిం చిన ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేశ్వరానికి కూడా ఫార్మసీ కళాశాల కావాలని సోసైటి అధ్యక్షులు హరీశ్‌రావుని అడగ్గానే ఒప్పుకున్నందుకు ధన్యవా దాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ కత్వంలో కేజీ టు పీజీలో అనేక విజయాల సాధించా మన్నారు. తొమ్మిది ఏండ్లలో 1000 గురుకులాలు 1450 జూనియర్ కళాశా లలో 85 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్‌కి దక్కుతుందన్నారు. మహిళా విద్య పట్ల ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మెన్ శంకర్, చిన్నకో డూరు ఎంపీపి కూర మాణిక్య రెడ్డి, రామంచ సర్పంచ్ సంతోష విక్రమ్, ప్రజాప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
తడకపల్లిలో పలు అభివద్ధి
కార్యక్రమాలకు శంకుస్థాపన
నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్
సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలో ముదిరాజ్, రెడ్డి, కురుమ, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లకు, పల్లె ప్రకతి వనం, స్మశానవాటిక, లైబ్రరీ భవనం, అంగన్వాడీ భవనంతో పాటు రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన పలు అభివద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొనా ్నరు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కాలేజీలు, వైద్యం, నీళ్లు రాలేదని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్య మంత్రి కేసీఆర్ కషితో తెలంగాణను ఎంతో అభివద్ధి చేసుకు న్నా మన్నారు. తడకపల్లి ప్రభుత్వ పాఠశాలకు రెండు కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో 50 లక్షలతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. సిద్దిపేటలో దసరాకు 1000 పడ కల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు నిర్మాణాల కోసం 300 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలి పారు. భవిష్యత్తులో కేసీఆర్ ను ఆశీర్వదించాలని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన సాంస్కతిక ప్రదర్శన పలువురిని ఎంతగానో ఆకట్టు కుంది. కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మంగ భాస్కర్, ఎంపీటీసీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఎల్లం, అర్బన్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు ఎద్దు యాదగిరి, ఎంఈఓ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.