- Advertisement -
నవతెలంగాణ – చండూరు
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన నిరుపేద కుటుంబానికి చెందిన యువతికి మాజీ సర్పంచ్ రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. గట్టుప్పల మండల పరిధిలోని వెల్మకన్నేకు చెందిన భీమనపల్లి కావ్య 393 మార్కులు సాధించింది. ఆమెకు ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అవుతుందని ఆలోచించిన గ్రామస్థులు మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం గౌడ్ ఆశ్రయించారు. స్పందించిన ఆయన తన సొంత డబ్బులు రూ. లక్ష ఆదివారం గ్రామస్థుల సమక్షంలో ఆ కుటుంబానికి అందజేశారు. భవిష్యత్లో తన సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ సర్పంచ్కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -