విమానం టేకాఫ్ చేస్తుండగా ఊడిపోయిన చక్రం…

Flightనవతెలంగాణ – హైదరాబాద్
టేకాఫ్ చేస్తుండగా విమానం చక్రం ఊడిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లాస్‌ఏంజిలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. జపాన్‌కు బయలుదేరిన యూనైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ బీ777-200 విమానం టేకాఫ్ చేసిన కొన్ని క్షణాలకే ల్యాండింగ్ గేర్‌లో ఎడమవైపు ఉన్న చక్రాల్లో ఒకటి ఊడి కిందపడిపోయింది. దీంతో, వెంటనే ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా లాండయ్యేలా విమానాన్ని డిజైన్ చేశారని వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో 249 మంది ప్రయాణికులు ఉన్నారు.

Spread the love