ధ‌ర్మ‌శాల‌ టెస్టులో రోహిత్, గిల్ సెంచ‌రీల‌ మోత‌…

నవతెలంగాణ – హైదరాబాద్
ధ‌ర్మ‌శాల‌లో జ‌రుగుతున్న ఐదో టెస్టులో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(101 నాటౌట్ : 155 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), యువ‌కెర‌టం శుభ్‌మ‌న్ గిల్‌(100 నాటౌట్: 140 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స‌ర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగారు. తొలి సెష‌న్‌లో సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డిన హిట్‌మ్యాన్ సిరీస్‌లో రెండో, మొత్తంగా 12వ‌ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఆ కాసేప‌టికే బ‌షీర్ బౌలింగ్‌లో బౌండ‌రీ బాది.. రాంచీ హీరో గిల్ మూడంకెల స్కోర్ సాధించాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు ఏమాత్రం అవ‌కాశ‌మివ్వ‌ని ఈ జోడీ కు 160ప‌రుగులు చేసింది. గిల్, రోహిత్ వీర‌విహారంతో భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగులు ఆధిక్యంలో ఉంది. లంచ్ స‌మ‌యానికి భార‌త్ స్కోర్.. 264/1.

Spread the love