కారును ఢీకొన్న ట్రక్కు.. ప్రమాదలో ఐదుగురు మృతి

నవతెలంగాణ – పంజాబ్‌ : పంజాబ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. కారులో చెలరేగిన మంటల వల్ల వారంతా సజీవదహనమయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి పంజాబ్‌లోని జలంధర్‌ – పఠాన్‌కోట్‌ రహదారిపై ట్రక్కు కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. జలంధర్‌ నుంచి మొకేరియన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు దసూయా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హర్ప్రేమ్‌ సింగ్‌ తెలిపారు. కారు ఉండి బస్సి గ్రామం వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం రోడ్డు డివైడర్‌ను ఢకొీట్టింది. ఆ తర్వాత రోడ్డుకు అవతలివైపు నుంచి ఎదురుగా వస్తున్న ట్రక్కు కారును ఢకొీట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తిని సివిల్‌ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హర్యానాకు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Spread the love