జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం..బీఎండబ్ల్యూ కారు దగ్ధం

నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రహదారిపై ప్రయాణిస్తున్న ఓ బీఎండబ్ల్యూ కారు మంటల్లో దగ్ధమైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కూడలి మీదుగా ఫిలింనగర్ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తులు కారును వదిలేసి అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే బీఎండబ్ల్యూ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటనతో జూబ్లీహిల్స్ లో రహదారికి ఇరువైపులా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటలు ఆర్పేందుకు వచ్చినా అగ్నిమాపక శాఖ ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించి అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకునేలా చేశారు. కారుకు సంబంధించి, కారు యజమానికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Spread the love