మారు మోగుతున్న సోషల్ మీడియా ప్రచారం..

– ప్రత్యేక కమిటీలు లక్షలాది రూపాయల ఖర్చు

నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక పార్టీ మరొక పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. వాట్సప్, వెబ్, యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా గ్రూపులు తయారు చేసుకుని కార్యకర్తల ద్వారా ప్రజలకు ప్రచారం చేయిస్తున్నారు ప్రత్యేకమైన సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీపై కర్ణాటకను బూచిగా చూపిస్తూ అక్కడి నిరసన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ వ్యతిరేక ప్రచారం  చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ లు దాడికి దిగుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ప్రస్తుతం జరిగిన పనిపై కేటీఆర్, హరీష్ రావుగత సభలలో దొర్లిన పొరపాట్లను హాస్యంతో చిత్రీకరిస్తూ తమ కార్యకర్తల ద్వారా పోస్టులు పంపిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పై నామమాత్రంగా వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర  రాజకీయాలతో పాటు కేంద్రంలోని రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు.  ఇజ్రాయిల్ పాలస్తిన యుద్ధ ఘటనలను కూడా వాడుకుంటున్నారు. భువనగిరిలో బిజెపి అభ్యర్థిగా ప్రచారం నిర్వహించుకుంటున్న గూడూరు నారాయణరెడ్డి తను వివిధ సందర్భాల్లో మాట్లాడిన ప్రసంగాలను ప్రస్తుత ప్రచార కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.  భువనగిరి నియోజకవర్గం లో పైళ్ల శేఖర్ రెడ్డి తను ప్రతిరోజు చేసే పర్యటనలు, అభివృద్ధి పనులను, వివిధ పార్టీ లనుండి చేరికలను చూపిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే తరహాలో ఆలేరు టిఆర్ఎస్ అభ్యర్థి విప్ గొంగిడి సునీత మంగలి, గౌడ, పద్మశాలి ,ముదిరాజు,  రజక, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులతో ఇతర సామాజిక వర్గాలతో వృత్తిదారులతో తమకు జరిగిన మేలు గురించి వివరిస్తున్న మాటల పోస్టులను ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల గురించి ప్రతిరోజు వాట్స్అప్ ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు తన పర్యటనలు ఎప్పటికప్పుడు వివరిస్తూ కార్యకర్తల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు అదే తరహాలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైన సోషల్ మీడియా విందును ఏర్పాటు చేసుకొని మండలాల వారిగా కమిటీలు వేసుకున్నారు ఆ కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో ప్రచారం జరిగే విధంగా పోస్టింగులు చేస్తున్నారు సోషల్ మీడియా గతంలో బిజెపి అధికంగా వాడుకున్నప్పటికీ ప్రస్తుతం అన్ని పార్టీలు సోషల్ మీడియాను ప్రచార నిమిత్తం పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు ఆ ప్రచారంలో ఎలాంటి రెచ్చగొట్టే వాక్యాలు లేకుండా ఎదుటివారిని హామీలను బలహీనపరిచే విధంగా తయారు చేస్తున్నారు వీటి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  ఈ సోషల్ మీడియా ప్రచారంపై నిఘా లేకపోవడంతో ఖర్చులు పరిగణంలోకి తీసుకునే అవకాశం అంతగా లేదు.
Spread the love