రోడ్డుపై ధాన్యం ఆరబోసిన యజమానిపై కేసు

A case against the owner of drying grain on the road– సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ
నవతెలంగాణ – సిరిసిల్ల
రహదారిపై ధాన్యం ఆరబోసి ప్రమాదానికి కారకుడైన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ పేర్కొన్నారు. సి ఐ కృష్ణ కథనం ప్రకారం… పట్టణంలోని వెంకటాపూర్ నుండి రగుడు వరకు  బైపాస్ రోడ్డుపై రైతులు వరి ధాన్యం కుప్పలను పోయడం వలన బైపాస్ రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన వివరించారు చంద్రంపేటకు చెందిన వేముల రాజశేఖర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై పెద్దూరు నుండి బైపాస్ రోడ్డుపై చంద్రంపేటకు వస్తుండగా పెద్ద బోనాల- చిన్న బోనాల మధ్యలో  బైపాస్ రోడ్డుపై పోసిన వరిధాన్యం కుప్పను ఢీకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అతని సోదరుడు వేముల రమేశ్ ఫిర్యాదు మేరకు రోడ్డుపై వరి ధాన్యము కుప్ప పోసిన చిన్న బోనాలకు చెందిన సరుగు భాస్కర్ అనునతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. కొందరు పండించిన ధాన్యాన్ని రోడ్లపై పోసి నూర్పిడి చేయడం,ఆరబెట్టుకోవడం వంటివి చేస్తుంటారు.అయితే నిత్యం వాహనాలు తిరిగే రోడ్లపై ధాన్యాన్ని నూర్పిడిచేయడం వల్ల రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి, కాబట్టి రైతులేవ్వరు రోడ్డుపై వరి ధాన్యాన్ని అరోబోసి ప్రమాదాలకు కారణం కావద్దని కోరారు. రోడ్డుపై ఆరబెట్టినా ధాన్యం కారణంగా ప్రమాధాలు జరిగి వాహనదారులు మరణించిన,గాయపడిన అట్టి యజమాని పై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ పేర్కొన్నారు.
Spread the love