కుల సంఘాల వారీగా సమీక్ష

నవతెలంగాణ- మోపాల్ : గురువారం రోజున మోపాల్ మండలంలోని బోర్గం పి శివారులో గల మోట్టాడి రెడ్డి ఫంక్షన్ హాల్ లో నూడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే , ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కి మద్దతుగా రెడ్డి బందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ స్పీకర్ మరియు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కె ఆర్ సురేష్ రెడ్డి హాజరవ్వడం జరిగింది. రెడ్డి బంధు ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి మాట్లాడుతూ మన రెడ్డి సభ్యులందరం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ కొరకు కలిసికట్టుగా పనిచేయాలని మన ఇంట్లో మన సోదరుడు నిలబడితే ఏ విధంగా కష్టపడతామో అదేవిధంగా మనమందరం బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కొరకు కలిసికట్టుగా పనిచేసే 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి తీరాలని హ్యాట్రిక్ విజయం అందించాలని ఆయన తెలిపారు. ఒకానొక సందర్భంలో కేటీఆర్ తనతో తిరిగి మళ్లీ బాజిరెడ్డి గోవర్ధన్ కి  టికెట్ అందించామని  రూరల్ ప్రజలు ఎంత మెజార్టీతో గెలిపిస్తారని ఒకవేళ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తన పక్కన గోవర్ధన్ కూర్చున్న పెట్టుకుంటామని నాతో అన్నారని తెలిపారు. అందుకే ఈసారి కచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి తన చిరకాల కోరిక అయిన మంత్రిగా చూడాలని కచ్చితంగా మనమందరం ఈ నలభై రోజులు కష్టపడితే ఆయన కోరికతో పాటు మన నియోజకవర్గ అభివృద్ధిని కూడా ప్రగతి పథంలో నడిపించొచ్చని అలాగే రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో రెడ్డి కుల సంఘాల కొరకు నాలుగు కోట్ల నిధులు కేటాయించలేదని అన్ని నిధులు కేటాయించిన ఏకైక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అని అలాగే దానితోపాటు ఎంతో మది నిరుపేదలైన రెడ్డిలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన గొప్ప వ్యక్తి అనీ అటువంటి వ్యక్తిని మనం తిరిగి హ్యాట్రిక్ విజయo   విధంగా తోడ్పడాలని ఆయన రెడ్డి సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఆయన నియోజకవర్గంలో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేయాలని దానికి స్థలంతో పాటు కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరగా, బాజిరెడ్డి గోవర్ధన్  వెంటనే కచ్చితంగా ఏర్పాటు చేస్తానని ఆయన మాట ఇచ్చారు.   మాజీ స్పీకర్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ నాకు బాజిరెడ్డి గోవర్ధన్ తో నలబై సంవత్సరాల నుండి మా మధ్య మంచి స్నేహం ఉందని రాజకీయాలు వారసత్వంగా  కొందరు తమ రాజకీయ గురువుల దగ్గర నేర్చుకుంటే మీ ఇద్దరం మాత్రం సిరికొండ,  చీమనుపల్లి దట్టమైన అడవుల్లో నేర్చుకున్నామని మా ఇద్దరి ఆలోచన విధానం ఇంచుమించు ఒకే విధంగా ఉంటుందని ఇంతసేపు ప్రజల అభివృద్ధి తప్ప మాకు మరో ధ్యాస ఉండదని ఒకప్పుడు మేమిద్దరం మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో పక్కనే గలగల నీరు పారుతున్న కూడా మా మండలాలకు సంబంధించిన భూములు మీరు లేక పంటలు పండించుకునే సాధ్యం కాలేదని అక్కడున్న రైతుల బాధలను చూసి మేము చెల్లించే పోయే వారుమని మా రాజకీయ గురువు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రాజెక్టులు చేపట్టి బీడు భూములను కూడా సస్యశ్యామలం చేశారని అలాగే తెలంగాణ ఏర్పాటు కాకముందు రోడ్లకు మహాదశ లేదని తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు చూస్తుంటే బంగారు తెలంగాణ సాధ్యమైందని అలాగే ఇంతకుముందు పాలించిన ప్రభుత్వాలు రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని మాటల్లో చెప్పారే తప్ప కేవలం కేసీఆర్ ఒకటి రైతుబంధు రైతు బీమా రూపంలో ప్రతి రైతును ఆదుకున్నాడని అటువంటి గొప్ప వ్యక్తి చేతుల్లో ఈ రాష్ట్రం ఉందని రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని 10సంవత్సరాల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి నా రెడ్డి సోదరులు ఆలోచించాలని ఒకప్పుడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 50 వేల కోట్లు ఉండేదని ప్రస్తుత తలసరి ఆదాయం రెండు లక్షల 50 వేల కోట్లకు చేరిందని అది కేవలం కేసీఆర్ ముందు చూపు వల్లనే సాధ్యమైందని 14 సంవత్సరాలు ఉద్యమం చేయడం వల్ల ప్రతి గ్రామ గ్రామాన తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఈకైక వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అటువంటి అడుగుజాడల్లోనే నేను కానీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి నడుస్తున్నారని, దాదాపు 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నా కూడా ఢిల్లీ మొత్తం తెలంగాణ పైన పడిందని ఎందుకంటే తెలంగాణ ధనిక రాష్ట్రం గాని తమ స్వలాభం కోసం ఈ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఇక్కడ నిధులని కొల్లగొట్టాలని చూస్తున్నారని నీ వారి ఆటలు సాగనివ్వద్దని ఓట్ల కోసం చుట్టాలగా కొత్త కొత్త నాయకులు మీ ఇంటికి వస్తారని వారి మాటలు నమ్మొద్దని ఈసారి కూడా ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ ని హ్యాట్రిక్ విజయ అందించే విధంగా నా రెడ్డి సోదరి సోదరీమణులందరూ కృషి చేయాలని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఢిల్లీలో ఒకటి గల్లీలో ఒకటి లాగుంటుందని కేవలం రిమోట్ మొత్తం ఢిల్లీలో ఉంటుందని వారు నిమిత్తమాత్రులే అని వారి మాటలు నమ్మొద్దని మన తెలుగుబిడ్డ మన ముఖ్యమంత్రి చేతిలో మన రాష్ట్ర అభివృద్ధి ఉంటుందని మనకు ఢిల్లీ లీడర్లకు సలాం కొట్టే అవసరం లేదని ఆయన తెలిపారు అలాగే రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి గురించి మాట్లాడుతూ తన తాతల కాలం నుంచి కూడా ఆయనతో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని ఈరోజు ఆడపిల్లలు చదువుతున్నారంటే కేవలం రాజు బహుదూర్ ముందు చూపు వల్లే అని నేను కేంద్ర ప్రభుత్వానికి ఆయన పైన స్టాంపు విడుదల చేయాలని విన్నవించాలని కచ్చితంగా నేను కూడా కేసీఆర్ తో మాట్లాడి నిరుపేద రెడ్డిల కోసం హాస్టల్ ఏర్పాటు చేసే విధంగా చూస్తామని, ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు గురించి ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డుపై ఉన్న అనుమానాలను పార్లమెంట్లో నేను ప్రస్తావించి కచ్చితంగా పసుపు రైతులకు న్యాయం జరిగి మద్దతు ధర అంది విధంగా చూస్తానని ఎలక్షన్లో మాట ఇచ్చినంత మాత్రాన కాదని కచ్చితంగా పసుపు బోర్డు దాని విధివిధానాలకు న్యాయం జరిగే విధంగా పార్లమెంట్లో పోరాడి తీరుతానని ఆయన తెలిపారు. ఈ ఎలక్షన్లో మన రెడ్డి బంధువులు మనతో పాటు పదిమందికి చెప్పి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపుకు కృషి చేయాలని మరింత అభివృద్ధిని చూడాలని ఆయన కోరారు.   ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో రెండు పర్యాయాలు విజయం సాధించడంలో మన నియోజకవర్గం మరువ లే నీనిదని నా చిన్ననాటి నుండి కూడా నాకు ఎక్కువమంది రెడ్డి కుల స్నేహితులే ఉండేవారని నేనెప్పుడూ కూడా రెడ్డిలకు వ్యతిరేక కాదని నా కూతురుతో సమానురాలైన నా కోడలు కూడా రెడ్డి కులానికి చెందిన అమ్మాయి అని అటువంటి అప్పుడు నేను రెడ్డిలకు ఎందుకు వ్యతిరేకమని కొందరు నాపై గిట్టను వాళ్లే నా పైన ముద్రవేశారే తప్ప నా పేరులో కూడా బాజిరెడ్డి ఉందని నన్ను ఇప్పటికీ కొందరు ఆంధ్ర రాయలసీమ నాయకులు నేను రెడ్డి కులస్తుడిగా భావిస్తారని నేను కూడా అలాగే ఉంటానని ఆయన తెలిపారు పదిమందికి సహాయపడే మనస్తత్వం నాదని నా రాజకీయ గురువు కూడా రెడ్డి అని సంతోష్ రెడ్డి నా రాజకీయ గురువు అని కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మా మధ్య కొంచెం దూరం పెరిగిందని అయినా కూడా నేను రెడ్డి బాంధవుడిగానే ఉంటానని నాతో ఇంతకుముందు ఎప్పుడు చంద్రమోహన్ రెడ్డి,  మానాల మోహన్ రెడ్డి తదితరులు నా వెంటే ఉండేవారని ప్రస్తుతం కూడా చైర్మన్ సంజీవరెడ్డి నాకు సోదరుడు తో  సమానమని  ఎల్లప్పుడు నా చుట్టుపక్కల దాదాపుగా రెడ్డి సోదరులు ఉంటారని నాకు రెండవసారి రాజకీయ భిక్ష పెట్టింది కూడా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన దయవాలనే రెండుసార్లుగా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని నాకు నక్సలైట్ల దాడి జరిగినప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని అటువంటి వారిని నా జీవితంలో మర్చిపోలేని ప్రస్తుత మేనిఫెస్టో కూడా వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని దాదాపు రెడ్డి సోదరులందరూ వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారని నాకు మూడోసారి రూరల్ టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కి ధన్యవాదాలు అని కాకపోతే నన్ను హ్యాట్రిక్ విజయం అందించడంలో మీ పాత్ర కీలకమని ప్రత్యర్థి పార్టీల ఎవరికి ఇంకా టికెట్ కేటాయించాకు నాకు కూడా కులానికి సంబంధం లేకుండా గుణం చూసి ఓటేయాలని నేనెప్పుడూ ప్రజల మనిషిని నాకు కుల తారతమ్యాలు లేవని తెలిపారు ఈ సందర్భంగా భూపతిరెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ నాకు సీఎం కేసీఆర్ మొదటిసారిగా టికెట్ కేటాయించిన వెంటనే నేను కేసీఆర్ తో కలిసి భూపతిరెడ్డి ఇంటికి వెళ్ళామని ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తాను ఆరోజు మాట ఇచ్చారని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నన్ను అడిగారని భూపతి రడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆ రోజు నేను కచ్చితంగా మాట ఇచ్చాను కచ్చితంగా ఎమ్మెల్సీ పది ఇవ్వాలని కోరారు అని చెప్పిన వెంటనే భూపతి రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారని కానీ ఓపిక లేకుండా పార్టీ చేంజ్ చేసి వేరే పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారని కానీ చివరికి ఓటమి చెందారని ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా పోయిందని రాజకీయాల్లో కచ్చితంగా ఓపిక సహనం ఉండాలని అది ఉంటే జీవితంలో పైకి రావచ్చని ఆయన తెలిపారు అలాగే మంచి పాప ప్రాజెక్టుపై కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అది మంచి పద్ధతి కాదని మంచిప ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్ పైప్ లైన్ ద్వారా మింట్రాజ్ పల్లి తదితర గ్రామాలకు నీరందుతుందని అలాగే రైట్ సైడ్ పైప్లైన్ ద్వారా 80 వేల ఎకరాలకు సాగు తాగునీరు అందుతుందని అటువంటి అప్పుడు 200 ఎకరాలు త్యాగం చేయడం వల్ల నష్టం కుదరని ఇప్పటికైనా నా నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని ప్రతిపక్ష నాయకులు మీకు మభ్య మాటలు చెప్తున్నారని ప్రాజెక్టును రద్దు చేస్తామని వారి మాటలు నమ్మకండి అని నా స్వలాభం దాంట్లో ఏం లేదని మీరు బాగుంటేనే నేను బాగుంటానని ఆ ప్రాజెక్టు వల్ల మన రూరల్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కనున్న నియోజకవర్గం సస్యశ్యామల అవుతుందని రైతు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుంది అని ఆలోచించే వాడినని నేను రాజకీయాల్లో స్వశక్తి పైన ఎదిగానని నాకు కుటుంబ రాజకీయాల్లో లేవని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలు చూసానని నాపై మూడుసార్లు నక్సల్ దాడి జరిగినా కూడా మీ అందరి దయ వల్ల బ్రతికి బయటపడ్డానని మీకు సేవ చేసే అదృష్టం నాకు ఆ దేవుడు ఇచ్చాడని ఆయన తెలిపారు. ఈసారి కూడా ఖచ్చితంగా మీరందరూ నన్ను ఆశీర్వదించాలని మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉన్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, ప్రతి ఒక్కరు సహకార అందించాలని పేరుపేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాకు గ్రూపు రాజకీయాలు తెలియదని ప్రజల బాగు కోసం ఎల్లప్పుడూ రాత్రి బవులు పనిచేసే వ్యక్తినని కుల రాజకీయాల నేనెప్పుడూ దూరంగా ఉంటానని అందరూ నా మనసు లాగానే భావిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ధర్పల్లి జెడ్పిటిసి కో బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ వ్యవసాయంలోనే సాయం ఉందని రెడ్డి సోదరులందరూ దాదాపు వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారని పది మందికి పని కల్పించే గొప్ప మనసున్న వ్యక్తులు రెడ్డి బంధువులని తన భార్య కూడా రెడ్డి కులస్తు రాలేరని నా లో సగభాగం రెడ్డి ఉందని ఎందువలన అర్ధాంగి రెడ్డి కులస్తురాలు కాబట్టి తెలంగాణ పోరాటంలో కూడ రెడ్ లు పోషించిన పాత్ర మరువలేనిదని నిజాం నవాబు కాలంలో కూడా రెడ్డి కులస్తుల అజమాష్ ఎక్కువగా ఉండేదని పదిమందికి అన్నం పెట్టే గొప్ప మనసున్న వ్యక్తులు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, జిల్లా ఒలంపిక్ సంఘము ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, కోర్వ దేవేందర్, ఎన్ డి సి సి బ్యాంక్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, అభిలాష్ రెడ్డి ఈగ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసిలు గడ్డం సుమన రెడ్డి సుమలత రెడ్డి, తనుజా రెడ్డి, ముత్యం రెడ్డి, రాజారెడ్డి, వివిధ గ్రామాల రెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు రెడ్డి కుల సంఘం నాయకులు పెద్ద మొత్తంలో  పాల్గొన్నారు .

Spread the love