దశాబ్ది కాలంలో శతాబ్ది ప్రగతి

– జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
నవతెలంగాణ-మర్కుక్‌
దశాబ్ది కాలంలో రాష్ట్రం శతాబ్ది ప్రగతి సాధించిందని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. శనివారం మర్కుక్‌ మండలం ఎర్రవల్లి, మర్కుక్‌, రైతు వేదికలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, తెలంగాణ రైతు దినోత్సవం కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతు వేదిక ఆవరణలో రైతు దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న ఏర్పాట్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతు దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ముందుగా మర్కుక్‌ క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి శ్యాం ప్రసాద్‌, జిల్లా ఉద్యానవన అధికారి సునీతలు తెలంగాణ సాధించిన తొమ్మిది సంవత్సరాల కాలంలో వ్యవసాయం, ఉద్యానవన రంగాలలో సాధించిన ప్రగతిని వివరించారు. జిల్లా కలెక్టర్‌ రైతులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మర్కుక్‌ ఎంపీపీ తాండ పాండు గౌడ్‌, జెడ్పిటిసి మంగమ్మ రాంచంద్రం యాదవ్‌, వైస్‌ ఎంపీపీ బాల్‌ రెడ్డి, మర్కుక్‌ సర్పంచ్‌ భాస్కర్‌, బీఆర్‌ఎస్‌ మర్కుక్‌ మండలాద్యక్షులు మర్కుక్‌ కర్ణాకర్‌ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసి లు, డిఆర్డిఏ అడిషనల్‌ పిడి కౌసల్య, మండల ప్రజా ప్రతినిధులు,బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతుల తదితరులున్నారు.
నవతెలంగాణ-బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన పలు అభివృద్ధి పనులు భావితరాలకు సత్పలితాలిస్తా యని, ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతోందని వైస్‌ ఎంపీపీ చెలుకల సభిత అన్నారు. శనివారం మండలంలోని బెజ్జంకి, పెరుకబండ, గాగీల్లపూర్‌, దాచారం, కల్లేపల్లి, బేగంపేట గ్రామాల్లోని రైతు వేదికల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత,వైస్‌ ఎంపీపీ చెలుకల సభిత,ఇంచార్జీ ఎంపీడీఓ అంజయ్య అద్వర్యంలో రైతు, వేదికల్లో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాచారం గ్రామంలో మహిళలు బతుకమ్మ,బోనాలు, బండ్లతో గ్రామ పంచాయతీ నుండి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్‌ హరీశ్‌ రావు జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ సంబురాలు జరుపుకున్నారు.
నవతెలంగాణ-జగదేవపూర్‌: ఇటిక్యాల రెవెన్యూ పరిధిలో గత 60 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పరిష్కరించారని రాష్ట్ర అటవీ అభివద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. మండలం పరిదిలోని ఇటిక్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్‌ చంద్రశేఖర్‌ రైతు వేదిక వద్ద చేసిన ఏర్పాట్లను జడ్పీ చైర్మన్‌ రోజా రాధాకృష్ణ శర్మ మరియు ఎఫ్‌ డి సి చైర్మన్‌ ప్రతాపరెడ్డిలు అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్‌, ఆత్మకమిటి ఛైర్మెన్‌ రంగారెడ్డి, జెడ్పిటిసి సుధాకర్‌ రెడ్డి, స్థానిక ఎంపిటిసిలు వాజియా బేగం, మహేందర్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు పనగట్ల శ్రీనివాస్‌ గౌడ్‌, క్లస్టర్‌ సర్పంచులు పిట్టల రాజు ,యాదవ రెడ్డి, కనక లక్ష్మీ చంద్రం ,వెంకట్రామి రెడ్డి, మండల రైతు కోఆర్డినేటర్‌ సుధాకర్‌ రెడ్డి వార్డ్‌ సబ్యులు, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సునీత, ఎంపీడీఓ శ్రీనివాస్‌ వర్మ,మండల వ్యవసాయ అధికారి వాసంతరవు,ఎస్‌ ఐ కృష్ణమూర్తి ఎయిఓ కాళిల్‌ పాల్గొన్నారు.
నవతెలంగాణ-నంగునూరు: దేశంలోనే రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీపీ జాప అరుణాదేవి అన్నారు. శనివారం నంగునూరు మండలం లోని ఎనిమిది క్లస్టర్‌ రైతు వేదకల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా రైతు దినోత్సవం నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ల అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాగుల సారయ్య, రాష్ట్ర ఆయిల్‌ ఫామ్‌ సొసైటీ రైతు ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, సోసైటి చైర్మన్లు ఎల్లంకి మహిపాల్‌ రెడ్డి, కోల రమేష్‌ గౌడ్‌, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బద్దిపడగ కిష్టారెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు వేముల వెంకట్‌ రెడ్డి, దువ్వల మల్లయ్య,ఇంచార్జ్‌ ఎంపీడీవో వేణుగోపాల్‌, తహశీల్దార్‌ దిలీప్‌ నాయక్‌,యంఈఓ తగిరెడ్డి దేశిరెడ్డి, యంఏఓ గీత, ఐకేపీ ఏపీఎం ఆంజనేయులు,పీఆర్‌ ఏఈ శశాంక్‌, ఈజీఎస్‌ ఈసీ పాషా, ఇరిగేషన్‌ ఏఈ రాజు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మద్దూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులు కట్టడంతో భూమికి బరువైన పంటలు పండుతున్నాయని మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మద్దూరు దూల్మిట్ట మండలంలోని మద్దూరు లద్నూరు బైరాన్‌ పల్లి కొండాపూర్‌ దూల్మిట్ట రైతు వేదికలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన రైతు దినోత్సవ వేడుకలకు ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతును పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం రైతు బీమా రైతు బంధు అంటే సంక్షేమ పథకాల రైతులకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సౌకర్యం అందిస్తున్నారని ఆయన అన్నారు రైతు సంక్షేమానికి కట్టుబడే బిఆర్‌ఎస్‌ పార్టీకి మూడోసారి అధికారం కట్టబెటలని రైతులను ఆయన కోరారు. రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ మేక సంతోష్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ మలిపెద్ది సుమ మల్లేశం, పిఎసిఎస్‌ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఇర్రి రాజిరెడ్డి, తహసిల్దార్‌ భూపతి, సర్పంచులు జనార్దన్‌ రెడ్డి, దుబ్బుడు దీపిక వేణుగోపాల్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, బద్దిపడగ లలిత, బొల్లు కృష్ణవేణి చంద్రమౌళి, జీడి కంటి సుదర్శన్‌, ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య, ఏవో రామకృష్ణ, ఏఈఓ రాకేష్‌ పాల్గొన్నారు
నవతెలంగాణ -గజ్వేల్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా అహ్మదీపూర్‌ గ్రామంలో రైతు వేదిక వద్ద ఏర్పాట కార్యక్రమంలో క్లస్టర్‌ పరిధిలోని కోలుగురు శేరిపల్లి రైతులతో రైతుబందు మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి తో కలిసి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులను చేసిన ఘనత ప్రభుత్వాన్ని దేనని తెలిపారు.
నవతెలంగాణ-చిన్నకోడూరు : రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజా శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని రోజా శర్మ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని కోరారు. రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చంద్రకళ రవి గౌడ్‌, లింగమూర్తి సంతోషి విక్రమాదిత్య, ఎంపీటీసీలు దుర్గారెడ్డి, లక్ష్మీయాదవరెడ్డి, సాయన్న, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-చేర్యాల: రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండలంలో ఉన్న 7 క్లస్టర్లలో శనివారం రైతు దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముస్త్యాల క్లస్టర్‌లో జరిగిన రైతు దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొని రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో సర్పంచ్‌ పెడతల ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు అంకుగారి శ్రీధర్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేశం, మండల కోఆర్డినేటర్‌ తాడెం రంజిత, పిఎసిఎస్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీ తాండ్ర నవీన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడిఏ టీ. రాధిక పాల్గొనగా చేర్యాల పట్టణ కేంద్రంలో జరిగిన రైతు దినోత్సవ వేడుకల్లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అంకుగారి స్వరూప రాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌ రెడ్డి, కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ ఉడుముల బాల్‌ రెడ్డి, వివిధ క్లస్టర్లలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి.అఫ్రోజ్‌ పాల్గొన్నారు.
కేక్‌ కట్‌ చేసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని రైతు వేదిక ఆవరణలో రైతుల సమక్షంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి హరీష్‌ రావు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మరింత సేవలు అందించాలన్నారు.
నవతెలంగాణ-దుబ్బాక/దుబ్బాక రూరల్‌: మండలలోని ఆకారం రైతు వేదిక పరిధిలోని గోసాన్‌ పల్లి, రగోత్తంపల్లి, బొప్పాపూర్‌, ఆకారం గ్రామాలకు చెందిన రైతులతో కలిసి శనివారం రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోసాన్‌ పల్లి సర్పంచ్‌ దొందడి లక్ష్మి, బొప్పాపూర్‌ సర్పంచ్‌ బండమీది బాలమణి మల్లయ్య, ఆకారం సర్పంచ్‌ కాస నాగభూషణం, ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మీనారాయణ గౌడ్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ ఎంపిఓ నరేందర్‌ రెడ్డి, ఏఈవో అస్మా, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు,రైతు సమన్వయ సమితి సభ్యులు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులతో కలిసి భోజనాలు చేశారు.
నవతెలంగాణ-సిద్ధిపేటరూరల్‌: దేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాల్లో రైతు వేదికగా రైతు దినోత్సవం నిర్వహించడం చాలా సంతోషకరమని సుడా చైర్మన్‌ మా రెడ్డి రవీందర్‌ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి చందర్రావు, జెడ్పిటిసి శ్రీహరి గౌడ్‌, అన్నారు. శనివారం సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని వెంకటాపూర్‌, రాఘవాపూర్‌, చిన్న గుండవెల్లి, చింతమడక, రైతు వేదికలలో రైతు దినోత్సవం రైతులతో కలిసి జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపిటిసిలు రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల ఇన్సాన్పల్లి మిట్టపల్లి బక్రీ చెప్యాల బూరుగుపల్లి మందపల్లి గ్రామాలలోని రైతు వేదికల వద్ద తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలను పూలతో, లైట్లతో అలంకరించారు. పొన్నాల ఏన్సాన్పల్లి మిట్టపల్లి గ్రామాలలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఇన్సన్‌పల్లిలో ఎడ్లబండ్లతో హాజరయ్యారు. ఎంపీపీ సవితా ప్రవీణ్‌ రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు, బీఆర్‌ఎస్‌ అర్బన్‌ మండల అధ్యక్షులు ఎద్దు యాదగిరి, ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ బాల్‌ రంగం, సర్పంచులు రవీందర్‌ గౌడ్‌, తన్నీరు రేణుక శ్రీనివాస్‌, వంగ లక్ష్మి, కొమ్ము రాజయ్య, ఎంపీటీసీ లు నాగుల స్రవంతి ప్రశాంత్‌ ,ఎద్దు మమతా యాదగిరి, బోనాల రంగం, పిఎసిఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు బాబు, రాజకుమార్‌ ,శ్రీలత, గీత తదితరులు పాల్గొన్నారు.
ఆశించిన స్థాయిలో స్పందన కరువు
ఉత్సవాలకు సంబంధించి రెండు రోజుల నుంచి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ చేయాలన్న ప్రజాప్రతినిధుల అధికారుల ఆలోచనలకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరగలేదు. ఇంచుమించు ప్రతి క్లస్టర్లో 1500 నుంచి 1000 మందికి తగ్గకుండా భోజనాలు ఏర్పాట్లు చేసి సమావేశాలు నిర్వహించాలనుకున్నా ఏ క్లస్టర్లో కూడా రెండు నుంచి 300కు మించి జనం రాలేదు.
నవతెలంగాణ-అక్కన్నపేట : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అక్కన్నపేట మండలంలోని జనగాం, పోతారం(జె) రామవరం, మల్లంపల్లి, అక్కన్నపేట రైతు వేదికలలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు, రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రౌండ్‌ వాటర్‌ డిడి సీతారాం, ఎంపీడీవో సత్యపాల్‌ రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ ఎడబోయిన రజిత తిరుపతి రెడ్డి, నేషనల్‌ లేబర్‌ ఫెడరేషన్‌ డైరెక్టర్‌ దండుగుల రాజ్యలక్ష్మి, ఏఈఓలు శ్రీలత, సింధుజ, రంజిత్‌, కార్యదర్శులు జమున, నిర్మల, తిరుమల, సతీష్‌, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు పెసరి సాంబరాజు, ఎంపీపీ లక్ష్మీ బీలు నాయక్‌, జడ్పిటిసి భూక్యమంగా, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ అశోక్‌ బాబు, సర్పంచులు స్వప్న నరేష్‌, కత్తుల మానస, ముత్యాల సంజీవరెడ్డి, గద్దల రమేష్‌, ఎంపీటీసీలు వొద్దిరాల కవిత, లింగాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
నవతెలంగాణ-వర్గల్‌ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం అన్ని రైతు వేదికల్లో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని నాచారం, తునికి ఖల్సా, మాజిద్‌ పల్లి, రైతువేదికల వద్దకు రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, డబ్బు చప్పుళ్లతో ఊరేగింపుగా వచ్చి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్‌ రెడీ, ఎఫ్‌ డి సి చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్‌, ఎంపీపీ లత, పిఎసిఎస్‌ చైర్మన్‌ ఇర్రి రామకృష్ణ రెడ్డి, ఎంపిడిఓ మేరీ స్వర్ణ కుమారి, రైతు బంధు సమన్వయ కర్త శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.
నవతెలంగాణ-దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవంలో భాగంగా శనివారం దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చీకోడు రైతు వేదికలో ”రైతు దినోత్సవం” కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. చీకోడ్‌ క్లస్టర్‌ పరిధిలోని పెద్ద చీకోడు సర్పంచ్‌ తౌడ శ్రీనివాస్‌, అచ్చుమాయిపల్లి సర్పంచ్‌ సోమారపు స్వప్న స్వామి, కమ్మర్‌ పల్లి సర్పంచ్‌ పర్స నరసయ్య, ఆరేపల్లి సర్పంచ్‌ శెట్టి సంతోషి లక్ష్మి కృష్ణంరాజు, దుబ్బాక పురపాలిక పరిధిలోని లచ్చపేట 10 వ వార్డ్‌ కౌన్సిలర్‌ కూరపాటి బంగారయ్య,11 వ వార్డ్‌ కౌన్సిలర్‌ నందాల శ్రీజ శ్రీకాంత్‌, చీకోడ్‌ ఎంపిటిసి లచ్చమ్మగారి రాంరెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌, ఏపిఎం దాకయ్య, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంగర ముత్తారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్‌ ఆస రవి, ధాత్రిక అనిల్‌, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ చెలుకల మధుసూదన్‌ రెడ్డి, స్వామి కొండల్‌ రెడ్డి పంచాయతీ సెక్రటరీలు, ఏఈఓ,కో ఆప్షన్‌ సభ్యుడు ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.
నవతెలంగాణ-తొగుట: రైతు హితమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ దోమల కొమురయ్య పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావుపేట రైతు వేదికలో జరిగిన రైతు దినో త్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. మండల వ్యవసాయాధికారి మోహన్‌, సర్పంచులు పాత్కుల లీలాదేవి వెంకటేశం,చిలు వేరి జ్యోతి మల్లారెడ్డి, బొడ్డు నర్సింలు,బిక్కనూరి రజిత శ్రీశైలం,రాచకొండ మంజుల సత్యనారాయ ణ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు మల్లారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బక్క కన కయ్య, రైతు బంధు అధ్యక్షుడు బండారు స్వామి గౌడ్‌, ఉప సర్పంచ్‌ సురేష్‌ గౌడ్‌,ఏఈఓ నవీన్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ,ఆత్మ కమిటీ డైరెక్టర్లు బిక్కనూరు సంతోష్‌, ఈదుగాళ్ల పర్శరాములు,సుతారి రాములు,నరిశెట్టి మల్లేశం పాల్గొన్నారు.
నవ తెలంగాణ-కొండపాక: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల గోస తెలిసిన వ్యక్తి అని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల పరిధిలోని కొండ పాక దుద్దెడ మెదనిపూర్‌ మర్పడగా కుకునూరుపల్లి గ్రామాల లోని రైతు వేదికల్లో రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో సమావేశం నిర్వహించారు మేదినీపూర్‌ రైతు వేదికలో రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు దేవి రవీందర్‌ అధ్యక్ష తన జరిగిన సమావేశానికి వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వేలేటి రోజా రాధా కృష్ణ శర్మ హాజరయ్యారు. గజ్వేల్‌ ఏసిపి రమేష్‌ డి సి సి బి చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి జెడ్పిటిసి అనంతుల అశ్విని ప్రశాంత్‌ ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కోలా సద్గుణ రవీందర్‌ ఆరేపల్లి మహదేవ్గౌడ్‌ అగ్రికల్చర్‌ ఏడి బాబు నాయక్‌ ఏవో ప్రియదర్శిని సర్పంచులు పోల్కంపల్లి జయంతి నరేందర్‌ తాడెం దశరథం కిరణ్‌ కుమార్‌ చారి వసంతా రుషి కనకవ్వ ఐలయ్య ఎంపీటీసీలు ప్రణవి శ్రీనివాస్‌ రెడ్డి హరిత సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

Spread the love