మూడు నెలల కనిష్టానికి పీఎంఐ
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, దేశీయంగా నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా భారత తయారీ రంగం మందగించింది. ఈ ఏడాది జూన్‌లో తయారీ రంగం వృద్ధి తగ్గిందని ఎస్ అండ్ పి గ్లోబల్ నిర్వహించిన హెచ్ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) వెల్లడించింది. జూన్ నెలలో పీఎంఐ 54.2 పాయింట్లకు పరిమితమయ్యిందని పేర్కొంది. మే నెలలో 55 పాయింట్లుగా ఉన్న ఈ సూచీ.. గత మూడు నెలలతో పోలిస్తే ఇదే అత్యల్ప స్థాయి అని సర్వే వెల్లడించింది. తయారీ రంగంలో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి, ఎగుమతులు, నియామకాల వేగం తగ్గడం ఈ పతనానికి ప్రధాన కారణాలని విశ్లేషించింది. పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే పైన కొనసాగితే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ఇటీవల ఈ సూచీ పడిపోవడం ఆందోళకరం. గతేడాది మార్చి తర్వాత ఎగుమతులు అత్యంత బలహీనమైన వృద్ధిని నమోదు చేశాయి.
పడకేసిన తయారీ రంగం
- Advertisement -
- Advertisement -



