రైతు ఉద్యమాలకు తీరనిలోటు : కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిల భారత రైతు సంఘం నేత, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన రైతాంగ సమస్యలపై, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం జీవిత కాలం పోరాటం చేసిన నిబద్ధత కలిగిన రైతు ఉద్యమ నాయకుడని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మరణం భారత రైతాంగ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం : హరీశ్‌రావు
సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడిగా, రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు సంఘం నాయకుడిగా సారంపల్లి మల్లారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, సంక్షేమం కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన కీలక పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సహచరులకు హరీశ్‌రావు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
నిబద్ధత కలిగిన నాయకుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



