కొడుకు స్నేహితునికి ఆర్థిక సాయం అందించిన తండ్రి

నవతెలంగాణ – గోవిందరావుపేట
వాహన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి చిరు వ్యాపారం చేసుకుంటున్న కుమారుని స్నేహితునికి ఒక తండ్రి అయిదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గురువారం మండల కేంద్రంలోని తారకరామా కాలనీలో నాగరాజు గతంలో ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి వికలాంగుడు గా మారాడు. కుటుంబ పోషణకు చిరు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆర్ మల్లేష్  కుమారుడు మరియు నాగరాజు క్లాస్మేట్ అయిన రవికుమార్ కూడా గతంలో విషపు పురుగు కాటేసిన ప్రమాదంలో మృతి చెందారు. తన కుమారుని క్లాస్మేట్ అయిన నాగరాజును అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని సంకల్పంతో మల్లేష్ సుభద్ర దంపతులు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కాగా మల్లేష్ ఆర్థిక సహాయాన్ని గ్రామంలోని మండలంలోని అతని బంధుమిత్రులు అభినందించారు. మల్లేష్ స్ఫూర్తిగా నాగరాజు కుటుంబాన్ని ఆదుకునేందుకు మరి ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని సూచించారు.
Spread the love