నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కాశీ లింగేశ్వర స్మామి స్థిర ప్రతిష్టాపన మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.గురువారం ప్రత్యేక పూజలతో కాశీ లింగేశ్వర స్వామి యంత్ర ప్రతిష్టించి వైభవంగా శివలింగా ప్రతిష్టాపన గావించారు.గ్రామస్తులు స్థిర ప్రతిష్టాపనలో పాల్గొని పూజలు చేశారు.
ప్రత్యేక పూజల్లో మాజీ ఎంపీ,ఎమ్మెల్యే: కాశీ లింగేశ్వర స్మామి స్థిర ప్రతిష్టాపన మహోత్సవాల్లో మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్,మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ,ఎమ్మెల్యేను శాలువ కప్పి సన్మానించారు.