తాలిపేరుకు పెరిగిన వరద

– 16 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీరు విడుదల
నవతెలంగాణ-చర్ల
రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆ నీరు తాలిపేరులో కలవడం వల్ల చర్ల మండల పరిధిలోని తాలిపేరు మధ్యతరగ ప్రాజెక్టుకు వరద ఉధృతి శుక్రవారం పెరిగింది. భారీగా పెరుగుతున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్త కోసం అధికారులు 16 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 11,505 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి 8 గంటల వరకు క్రమేపీ నీటి ఉధృతి తగ్గడంతో 11 గేట్లు ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు డీఈ తిరుపతి తెలిపారు.

Spread the love