నవతెలంగాణ – నూతనకల్
జడ్పి ఉన్నత పాఠశాల 1991-1992 పదోతరగతి చదివిన విద్యార్థులు ఆదివారం మండల పరిధిలోని గుండ్లసింగారం కేడీఆర్ పక్షన్ హాల్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 32 సంవత్సరం లు తర్వాత కలుసుకోవడం అభినందనీయమని అలనాటి ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తాటి విద్యార్థులు గత శ్మృ త్తులను నెమరు వేసుకొని సంతోషాలను వ్యక్తం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు యల్లారెడ్డి, జాన్, మల్లయ్య, మస్తాన్, జగదీష్, దామోదర్, రామచంద్రయ్య పూర్వవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.