దళిత బంధు కు తాత్కాలిక బ్రేక్ కథనం పై తీవ్ర చర్చ…

– ఏ నలుగురు కలిసినా ఇదే ఊసు… 
– నిరాశకు లోనైన దరఖాస్తు దారులు…
– ఈ పధకం మంజూరి విషయంలో అధికార పార్టీ నాయక శ్రేణి లో చీలిక…..
– అధికార,ప్రతిపక్ష పార్టీలను వేదిస్తున్న దళిత నాయకత్వ లేమి…..
నవతెలంగాణ – అశ్వారావుపేట : దళిత బంధు తాత్కాలిక బ్రేక్ శీర్షికన నవతెలంగాణ లో బుధవారం ప్రచురితం అయిన కథనం పై నియోజక వర్గం వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది.నియోజక వర్గం వ్యాప్తంగా వేలాది మంది దళితులు ఈ పధకం కోసం ఆశ గా దరఖాస్తు చేసుకున్న నేపధ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిందని తెలిసిన ఆశావాహులు ఏ నలుగురు కలిసినా ఇదే ఊసు పై మాట్లాడటం విశేషం. ఈ పధకం లబ్ధిదారుల ఎంపిక లో ఓ సామాజిక వర్గం నాయకుడు కీలకంగా వ్యవహరించడంతో మారి కొన్ని సామాజిక వర్గాలు గుర్రం గా ఉన్నారు.ఈ క్రమంలో మంగళవారం దళిత లబ్ధిదారుల జాబితా తయారీలో అధికారపార్టీ నాయక్ శ్రేణి లో చీలిక ఏర్పడినట్లు తెలుస్తుంది.ఈ పంచాయితీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చెంతకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం ఇదిలా ఉండగా పెత్తందారీ కులం నాయకులకు దళిత దళారులు గా వ్యవహరించే ద్వితీయ శ్రేణి దళిత నాయకులు కొందరు దళితేతర నాయకులు ఆదేశాలు మేరకు దరఖాస్తుదారు లుకు యూనిట్ లు ఆశ చూపి ముందస్తు వసూళ్ళకు పాల్పడ్డట్లు ఈ కథనంతో బహిర్గతం అయింది.దీంతో తీసుకున్న డబ్బులు రాబట్టుకోవడం ఎలా అనే మీమాంసలో దరఖాస్తుదారు లు కొందరు నిరాశకు లోను అవుతున్నారు. నియోజక వర్గం కేంద్రం అయినప్పటికి అధికార ప్రతిపక్షాల పార్టీల్లో దళిత నాయకత్వ లేమి కారణంతో దళిత బంధు ఎంపిక లోనూ దళితేతర నాయకులే పోటీలు పడటం దీనికి నిదర్శనం.
Spread the love