Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూనివర్సిటీలో ఎ జర్నీ ఆఫ్ బిజినెస్ కార్యక్రమం..

యూనివర్సిటీలో ఎ జర్నీ ఆఫ్ బిజినెస్ కార్యక్రమం..

- Advertisement -

నవతెలంగాణ-డిచ్ పల్లి 
తెలంగాణ యూనివర్సిటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ) వ్యాపార నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో కార్పొరేట్ ప్రపంచంలోని వాస్తవ పరిస్థితులను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో “ఏ జర్నీ ఆఫ్ బిజినెస్” అనే స్కిట్ కార్యక్రమాన్ని గురువారం యూనివర్సిటీలో విజయవంతంగా నిర్వహించారు.ఒక విజయ వంతమైన సంస్థ వెనుక జరిగే ప్రణాళికలు, జట్టుకృషి, నాయకత్వం, సవాళ్లను ఎదుర్కొనే విధానం, నిర్ణయాల ప్రక్రియ, చివరకు సంస్థ విజయాన్ని ఈ స్కిట్ ద్వారా వేదికపై ఆకట్టుకునేలా ప్రదర్శించారు. కార్యక్రమాన్ని వీక్షించిన అధ్యాపకులు, విద్యార్థులు స్కిట్‌ను అభినందించి, ఇది కార్పొరేట్ సంస్కృతిపై అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ప్రొఫెసర్ సి హెచ్ అంజనేయులు మార్గ దర్శకత్వంలో నిర్వహించారు.

కార్యక్రమ నిర్వాహకులు సహిల్ అవేజ్, సమత, మహేష్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కార్పొరేట్ ప్రపంచంపై ఆచరణాత్మక అవగాహన కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు, జట్టుకృషి, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సమర్థ వంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించే అవకాశాన్ని అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -