ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం…

– యువకుడి గొంతుకోసి దారుణ హత్య
– ఒక మైనర్‌లో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-బేగంపేట్‌
హైదరాబాద్‌ బేగంపేటలో ఓ యువకుడు అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. తన మరదలిని ప్రేమిస్తున్నాడని ద్వేషం పెంచుకున్న యువకుడు తన చిన్ననాటి స్నేహితుడు, మరో ఐదురుగు వ్యక్తులతో కలిసి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ హత్యలో ఓ మైనర్‌ కూడా పాల్గొనడం గమనార్హం. ఆరుగురు నిందితులను బేగంపేట పోలీసుల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బుధవారం సికింద్రాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో అడిషనల్‌ డీసీపీ ఏ.అశోక్‌తో కలిసి డీసీపీ ఎస్‌. రష్మి పెరుమాల్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ బేగంపేట పాటిగడ్డలో నివాసముండే ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ ఇజాజ్‌ అదే ప్రాంతంలో నివాసముండే షేక్‌ ఉస్మాన్‌(26) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. కాగా షేక్‌ ఉస్మాన్‌, ఇజాజ్‌ మరదలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గత రెండేండ్లుగా వీరి మద్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నది. కాగా ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం ఇజాజ్‌కు తెలియడంలో ప్రేమ వ్యవహారాన్ని ఇక్కడ తో విరమించుకోవాలని, ఇక నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి ఫోన్‌ సంభా షణలు, ఇతర సమాచారాలు ఉండరాదని హెచ్చరిస్తూ వారి ఇద్దరి ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేయించాడు. ఇదిలా ఉండగా ఇజాజ్‌ మరదలి తల్లి దండ్రులు ఆమెకు పెండ్లి సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకున్న షేక్‌ ఉస్మాన్‌ ఆమె తన నుంచి దూరం అవుతుందని.. ఆమెకు పెండ్లి సంబంధాలు రాకుండా ఉండేందుకు గాను ఆమె పేరు మీద స్నాప్‌చాట్‌లో ఒక ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశాడు. అందులో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు ఫేక్‌ మెసేజ్‌లు పెట్టడం ప్రారం భించాడు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో షేక్‌ ఉస్మాన్‌, అతని తల్లి, సోద రుడు హుస్సేన్‌ కలిసి ఇజాజ్‌ ఇంటికివెళ్లి అతని మరదలిని ఉస్మాన్‌కు ఇచ్చి పెండ్లి చేయాలంటూ ఇజాజ్‌ భార్యతో ఘర్షణకు దిగారు. లేదంటే ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంటానని ఉస్మాన్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు.ఇదే విష యాన్ని ఇజాజ్‌కు ఆయన భార్య ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆగ్రహానికి గురైన ఇజాజ్‌ తన మిత్రులతో కలిసి ఉస్మాన్‌ సోదరుడు అయిన హుస్సేన్‌ వద్దకు వెళ్లి అతన్ని బెది రించాడు. ఫేక్‌ మెసేజ్లుపెట్టి ఆమె పరువు తీయ రాదని, ప్రవర్తన మార్చుకోకుంటే ఉస్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. అటు తరువాత ఇజాజ్‌ తన స్నేహితులు అయిన పాడిగడ్డకు చెందిన మెకానిక్‌ మహ్మద్‌ ఫెరోజ్‌, సాహిల్‌ ఖాన్‌, స్విగ్గీ డెలివరీబారుగా పనిచేస్తున్న మహ్మద్‌ ఫజల్‌, ట్రావెల్స్‌ ఏజెంట్‌ ఎండీ. రషీద్‌, మరో మైనర్‌ను ఉస్మాన్‌ను చంపేందుకు స్కెచ్‌ వేశాడు.తన ప్లాన్‌లో భాగంగా మంగళవారం రాత్రి 11.40గంటల సమయంలో ఉస్మాన్‌ కోసం దారిలో మాటు వేశారు. అదే సమయంలో ఉస్మాన్‌ తన సోదరితో కలిసి బైక్‌పై పాటిగడ్డ ఆటో స్టాండ్‌ నుంచి వస్తూ గణేష్‌ మండపం వద్దకు చేరుకోగా అప్పటికే తన స్నేహితులతో అక్కడ మాటు వేసిన ఇజాజ్‌ ఉస్మాన్‌ బైక్‌ను అడ్డగించాడు. అతని బైక్‌ నుంచి దింపి పక్కనే గ్రౌండ్‌లోకి లాక్కెళ్లారు. మిగతా వారు ఉస్మాన్‌ను గట్టిగా పట్టుకోగా మతుడి సోదరి ఎదుటే కత్తితో ఇజాజ్‌ అతని గొంతు కోశాడు. ఉస్మాన్‌ను ముఖంపై కత్తితో అనేక సార్లు పొడిచాడు. దీంతో ఉస్మాన్‌ గొంతు పూర్తిగా తెగిపోయి తల మొండానికి వెళాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. హటాత్పరిణా మాన్ని కళ్లారాచూసిన అతని సోదరి గట్టిగా కేకలు వేయడంలో నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. మతుడి కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్తలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్టు చేసి ఐదుగురిని రిమాండ్‌ చేయగా, బాలుడిని జువైనైల్‌ హౌవమ్‌కు తరలించారు.

Spread the love