Monday, August 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణలో సరికొత్త ఇంధన విప్లవం

తెలంగాణలో సరికొత్త ఇంధన విప్లవం

- Advertisement -


ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

​సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణలు, కాలిఫోర్నియా అనుభవాలను ఉపయోగించుకుని తెలంగాణలో సరికొత్త ఇంధన విప్లవానికి శ్రీకారం చుట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అమెరికా పర్యటనలో బాగంగా ఆదివారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని ‘ఇండియా ఎనర్జీ అండ్‌ క్లైమేట్ సెంటర్’ (ఐఈసీసీ) ను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇండియా పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనతో పాటు తెలంగాణను స్వచ్ఛ ఇంధన గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలపై చర్చించారు. 2030 నాటికి బారత్‌ 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ సామర్థ్యాన్ని అందుకునేందుకు అవసరమైన వ్యూహాలు, తగ్గుతున్న శుద్ధ సాంకేతికత ఖర్చులు తెచ్చిపెడుతున్న నూతన అవకాశాలను ఈ సమావేశంలో పరిశీలించారు. గ్రిడ్ ఆధునీకరణ, పారిశ్రామిక డీకార్బనైజేషన్, ఆధునిక బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల సమన్వయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పారదర్శకమైన హరిత విధానం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ సౌరశక్తితో పాటు ఇతర పునరుత్పాదక సామర్థ్యాన్ని వేగవంతంగా విస్తరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం వారికి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -