నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి

ఎక్స్ రోడ్డువాసులు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ పెద్దవంగర: పెద్దవంగర గ్రామ పరిధిలోని ఎక్స్ రోడ్డు ప్రాంతాన్ని నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. బుధవారం నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం పెద్దవంగర గ్రామ సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ కు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎక్స్ రోడ్డు నాయకులు అనపురం రవి గౌడ్, ధర్మారపు యాకయ్య, ఎడ్ల సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో సుమారు 1400 వందల మంది జనాభా నివసిస్తుందని తెలిపారు. ఎక్స్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా ప్రాంతం గత కొన్నేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు సుదీర్ఘకాలంగా నివసిస్తున్నామని, తమ ప్రాంత ప్రజల అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ ను కోరారు. వెంటనే స్పందించిన సర్పంచ్ మాట్లాడుతూ..ఈ అంశాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టికి తీసుకెళ్లి, ఎక్స్ రోడ్డు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు బాలాజీ, రాజు, వేణు, రాజశేఖర్, వెంకట్ రెడ్డి, శ్రీను, నివాస్, సోమన్న, నారాయణ, మధుసూదన్ రెడ్డి, గుంషావళి, షంశుద్దీన్, పవన్, రామ్మూర్తి, స్వామి, శ్రీనివాస్ రెడ్డి, నాగన్న, మల్లేష్, కుమార్, చెన్నయ్య, రమేష్, అనిల్, రాజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love