శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ షురూ

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రతిరోజూ వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ప్రపంచంలో అత్యంత రద్దీగల ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం కొత్త టెర్మినల్‌ నుంచి పూణేకు తొలి విమానం బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ అధికారులు రిబ్బన్‌ కటింగ్ చేసి టెర్మినల్‌ని ప్రారంభించారు. దీంతో వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిపాచర్‌ గేట్స్‌(12), ఏరో బ్రిడ్జెస్‌(12), రిమోట్‌ బస్‌ డొమెస్టిక్‌ డిపాచర్‌ గేట్స్‌(24), కాంటాక్ట్‌ స్టాండ్స్‌ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు, సురక్షిత ప్రయాణాలే లక్ష్యంగా ఈ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రకటించింది. మూడో దశ విస్తరణలో భాగంగా తూర్పు భాగంలో 2.17 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ టెర్మినల్‌‌ను ప్రారంభించామని, ఇక్కడ వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది.

Spread the love