ఆటోను ఢీకొన్న ట్రక్కు : ఆరుగురు మృతి

నవతెలంగాణ- దాహోద్‌ : గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం దాహోద్‌ జిల్లాలో దాహోద్‌- అలీరాజ్‌పూర్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ చిన్నారి, మహిళ, నలుగురు పురుషులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన సుమారు మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పటియాజోల్‌ గ్రామంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో రిక్షా డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Spread the love