– యోగా తో మానసిక ఆరోగ్యం
– మానసిక వైద్య నిపుణులు డాక్టర్.జి.మహేంద్ర కుమార్ రెడ్డి, డా.హిప్నో పద్మా కమలాకర్
నవతెలంగాణ – హైదరాబాద్: యోగా తో మానసిక ఆరోగ్యం బాగుంటుందని మానసిక వైద్య నిపుణులు డాక్టర్.జి.మహేంద్ర కుమార్ రెడ్డి, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. నవభారత లయన్స్ క్లబ్ , యోగా గురువులైన బొబ్బిలి సరోజిని,బి.రామారావు ఆధ్వర్యంలో అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ లో మానసిక సమస్యల పై అవగాహన కల్పించారు. యోగా మానసిక బలాన్ని పెంచి ,స్వీయ నియంత్రణ భావాన్ని బలపరుస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందన్నారు. ఆహార పరిశుభ్రత కచ్చితంగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పారు. బాహ్య పరిశుభ్రతతో పాటు మనసులోని క్లేశాలను తొలగిం చుకుని, మనో శుభ్రతను కూడా పాటించాలన్నారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యమే మహాభాగ్య మన్నారు. సైకాలజిస్ట్ లందరికీ యోగా పై అవగాహన ఉండాలన్నారు. ఈ సంవత్సరం అందరికీ మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించడం, మాట్లాడేలా చేయాలని ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చిందన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా మానసికంగా కృంగి పోతున్న వారు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “మీతో మీరు మాట్లాడుకొండి సమస్యల నుంచి త్వరగా బయటకు రాగలరు న్నారు. ”
” స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ జే.టి.విద్యా సాగర్” మాట్లాడుతూ మనసులోని అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోచ్ఛన్నారు. మానసిక బలాన్ని పెంచు తుందన్నారు. యోగా అనేది మనస్సును, మానసిక పరిశుభ్రతను వాక్యూమ్ క్లీన్ చేయడం లాంటిదని తెలిపారు. జోనల్ చైర్ పర్సన్ లయన్ సి.హెచ్. గోపాలకృష్ణ, మాట్లాడుతూ యోగా”పాజిటివ్ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింపచేసే ఒక శాస్త్రం మన్నారు.ప్రశాంతతే యోగా అంతిమ లక్ష్యమన్నారు. మనిషి తన శారీరక వ్యవస్థల పట్ల, మానసిక ప్రక్రియల పట్ల అదుపు సాధించటానికి చేయవల్సిన సాధన యోగా అని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నవభారత్ అధ్యక్షులు లయన్ బెల్లంకొండ వినయ్ మాట్లాడుతూ ఒక సమర్ధుడైన గురువు పర్యవేక్షణ లో చేయాలన్నారు. సాధకులు అడిగిన ప్రశ్నలకు చక్కని పరిష్కారాలు సూచించారు.
” మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించిన లయన్ 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ జి.మహేంద్ర కుమార్,” స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ జే.టి.విద్యా సాగర్, జోనల్ చైర్ పర్సన్ లయన్ సి.హెచ్. గోపాలకృష్ణ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నవభారత్ అధ్యక్షులు లయన్ బెల్లంకొండ వినయ్ ను యోగా గురువులైన బొబ్బిలి సరోజిని, బి.రామారావు ఘనంగా సన్మానించారు. డా.పి.స్వరుపా రాణి, లయన్ జి.కృష్ణవేణి, ఇందిరా పార్క్ యోగా సెంటర్ సాధకులు పాల్గొన్నారు.