రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నవతెలంగాణ- వికారాబాద్‌ ప్రతినిధి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుం బ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వికారా బాద్‌ కొత్తగాడికి చెందిన ముత్తర గళ్ళ వేణు గోపాల్‌ (40) హైదరాబాద్‌ మల్లారెడ్డి ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌చార్జిగా 12ఏండ్లుగా పనిచేసు న్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం ట్రైన్‌కు బయలుదేరి వెళ్లారు. లింగంపల్లిలో ఉన్న తన బైక్‌ తీసుకొని విధులు నిర్వహించేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. బాచుపల్లి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడ స్తం భాలకు ఏర్పాటుచేసిన రాడ్డులకు బైక్‌ ఢకొీన డంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంట నే ఆస్పత్రికి తరలించారు. చికి త్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెం దాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉ న్నారు. అందరిలో కలుపుగోలు లాగా ఉండే వేణుగోపాల్‌ అకస్మాత్తుగా మృతి చెందడంతో స్నే హితులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వేణుగోపాల్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : పడి గళ్ళ అశోక్‌, జిల్లా పబ్లిక్‌ వాయిస్‌ ఫోరం అధ్యక్షులు బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడ ఎలాంటి హెచ్చరికలు లేనందున వేణు గోపాల్‌ స్తంభాలకు కట్టిన రాడ్లను ఢకొీన్నాడు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి వేణుగోపాల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి.

Spread the love