దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

–  వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు కోఆప్షన్ సభ్యులు  హైమద్
నవతెలంగాణ- మిరుదొడ్డి : దుబ్బాక నియోజకవర్గం లో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, కోఆప్షన్ సభ్యుడు హైమద్ అన్నారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో ఇంటింటా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించారు. గత ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గతంలో చేసిన పొరపాటు మరోసారి చేయొద్దంటూ విన్నవించారు. ఈ కార్యక్రమంలో గునమ్మగరి ప్రసాద్, భాను, ప్రశాంత్, రంజిత్ పలువురు పాల్గొన్నారు.
Spread the love