నిర్మలా సీతారామన్ బీజేపీ, కాంగ్రెస్ బండారం బయటపెట్టారు.. మంత్రి హరీశ్ రావు

– చేతులు జోడించి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా
– కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే 
నవతెలంగాణ – సిద్దిపేట: నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడుతూ తెలంగాణ లో కేసీఆర్ తప్ప ఇతర ప్రాంతాలలో మోటర్లకు మీటర్లు పెట్టారని చెప్పారని, బీజేపీ,  కాంగ్రెస్ బండారం బయటపెట్టారని మంత్రి హరీశ్ రావు అన్నారు. చేతులు జోడించి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లేనని  అన్నారు.  బుధవారం శివ అనుభవ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లు అబద్దాలతో అదరగొట్టే ప్రయత్నం బీజేపీ నాయకులు చేశారని, మోటార్లకు మీటర్ల అంశంపై నిర్మలా సీతారామన్  కుండ బధ్దలు కొట్టారని అన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఓట్ల కోసం ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని, ఈటెల రాజేందర్, రఘునందన్, అరవింద్ ఓట్లు ఎలా అడుగుతారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టను అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. 12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారని, మరికొన్ని దరఖాస్తు వచ్చాయని నిర్మలనే తెలిపారని తెలిపారు. రైతుల పక్షాన నిలబడ్డది ఒక్క కేసీఆర్ మాత్రమేనని, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయని, తప్పిపోయి తెలంగాణలో గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెడతారని అన్నారు. 5 గంటల కరెంట్ అని శివకుమార్ బట్టబయలు చేశారని, కాంగ్రెస్, బీజేపీ రెండు రైతుల పాలిత శత్రువులని అన్నారు. యూపీఏ వేసిన స్వామినాథన్ కమిటీని ఆ పార్టీ తుంగలో తొక్కిందని, మోడీ గెలవగనే అమలు చేస్తాం అని చెప్పి మోసం చేశారని అన్నారు. బీజేపీ పాలిత యుపి, అస్సాం, మణిపూర్ లో మీటర్లు పెట్టారని, ఇండియా కూటమి తమిళనాడు, బెంగాల్, కేరళ లో పెట్టారని, బీజేపీ,  కాంగ్రెస్ సంబంధం లేకుండా ఎపీ, మేఘాలయ వంటివి మీటర్లు పెట్టాయని, దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టానని అసెంబ్లీలో ప్రకటించిన ఏకైక రాష్ట్రం, ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. 69 లక్షల రైతుల ప్రాణాలు ముఖ్యమని అన్నారు. రైతును నిలబెట్టింది కేసీఆర్, మనం ఇప్పుడు కేసీఆర్ ను నిలబెట్టాలని కోరారు.  2014లో తెలంగాణ తలసరి ఆదాయం  రూ. 1,24,104 ఉండగా 2023లో రూ.3,17,117 కు పెరిగింది. అంటే రెండున్నర రెట్లు పెరిగింది వాస్తవం కాదా అని అన్నారు. 2014లో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎదిగిందని,  సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషి వల్ల సాధ్యమైంది. దీనిని ఎందుకు ఒప్పుకోరు అని ప్రశ్నించారు.  దేశ తలసరి ఆదాయం రూ.1,72,000 మాత్రమే,  అంటే తెలంగాణ కన్నా రూ.1,45,000 తక్కువ మీ అసమర్థతను ఎందుకు ఒప్పుకోలేదని అన్నారు. అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పడం నిజంగా సిగ్గుచేటని, 2014లో కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చేనాటికి దేశం మీద ఉన్న అప్పు దాదాపు రూ.55 లక్షల కోట్లు,  ఇప్పుడు రూ.155 లక్షల కోట్లు దాటిందని,  అంటే ప్రతి నెల దాదాపు  లక్ష కోట్లు అప్పు చేసిన ఘనత మీదని అన్నారు. పైగా అప్పులు తగ్గిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పడం బాధాకరమని అన్నారు.  కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కొంత జీతాలు ఇవ్వడంలో ఆలస్యం అయ్యిందని,  ఇబ్బంది జరిగిన మాట వాస్తవమని, కేంద్రంలో మనం కీలక పాత్ర పోషిస్తం , కేసీఆర్ ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, రాబోయే రోజుల్లో  మొదటి తేదీన వేతనం ఇచ్చేలా చూస్తామని అన్నారు.  9 ఏళ్లలో 133 శాతం వేతనాలు పెంచింది బీఆర్ఎస్ అని,
నాడు జీతాలు, పించనర్ల పై 18 వేల కోట్లు ఖర్చు చేస్తే నేడు 60వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాము అంగన్వాడీ, ఆశా, వీఏవోలను గుర్రాలతో తొక్కించారని అన్నారు. వి ఆర్ ఎ, ఆర్టీసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసింది కేసీఆర్ అని అన్నారు. ఉపాధ్యాయ,  ఉద్యోగులు, పించనర్లు, చిరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని దీవించాలనీ ప్రార్థిస్తున్నఅని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, కొండం సంపత్ రెడ్డి, మాణిక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love