హైదరాబాదీ బుర్రకథకు అరుదైన గౌరవం

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాదీ బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది. ‘శాంసన్‌ అండ్‌ దెలీలా’ అనే బుర్రకథ టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్‌ రావు, చిల్కూరి వసంతరావు, చిల్కూరి సుశీల్‌ రావు అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించారు. వీరుడైన శాంసన్‌ అందమైన దెలీలాతో ఎలా ప్రేమలో పడతాడనే బైబిల్‌ కథ ఆధారంగా శాంసన్‌ అండ్‌ దెలీలా బుర్ర కథను రూపొందించారు.
టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్న ఈ బుర్రకథను చిల్కూరి సుశీల్‌రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిల్కూరి బుర్రకథ బృందం 1980 నుంచి తమ ప్రదర్శనలను మొదలుపెట్టారు. అప్పటి నుంచి హైదరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో అనేక బుర్రకథ ప్రదర్శనలను ఇచ్చారు. వీరిలో చిల్కూరి శ్యామ్‌ రావు సీనియర్‌ న్యాయవాది. చిల్కూరి వసంతరావు బెంగళూరులోని యునైటెడ్‌ థియోలాజికల్‌ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. చిల్కూరి సుశీల్ రావు పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు.

Spread the love